టీఆర్ఎస్ @ 20 : తెలంగాణ గుండె చప్పుడు !

తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల స్వప్నం స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. స్వయం పాలన , నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని2001 ఏప్రిల్‌ 27 నాడు జలదృశ్యంలో కేసీఆర్ ప్రారంభించారు. అప్పుడు ఆయన వెంట గుప్పిడు మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇవాళ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించే పార్టీగా మారింది.

మొక్కవోని పట్టుదలతో మొక్క నుంచి వృక్షంలా టీఆర్ఎస్‌ను పెంచిన కేసీఆర్ !

తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఓ దశలో ఇక టీఆర్ఎస్ పనైపోయిందని అనుకున్నారు. కానీ వైఎస్ మరణం తర్వాత అప్పటి వరకూ తొక్కి పెట్టిన తెలంగాణ ఉద్యమం ఒక్క సారిగా జూలు విదిల్చుకుంది. దాన్ని కేసీఆర్ అందిపుచ్చుకున్నారు. స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టారు. 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షే మలి దశ ఉద్యమానికి కీలకమని చెప్పుకోవచ్చు. 2009 నవంబర్ 29వ తేదీన తెలంగాణ కోసం కరీంనగర్ నుంచి సిద్దిపేట బయల్దేరగా కరీంనగర్ వద్ద గల అల్గునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. కేసీఆర్ దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి రెండురోజులు బంధించారు. జైల్లో కూడా కేసీఆర్ నిరహార దీక్ష చేశారు. నిమ్స్ తీసుకొచ్చినా దీక్షను కంటిన్యూ చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటంతో చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ !

ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, సంయమనంతో, పట్టువిడుపులు ప్రదర్శించారు కేసీఆర్‌. అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకత్వానికి భరోసా ఇస్తూ తెలంగాణ స్నప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ అదిష్టించి.. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఉప ఎన్నికలే కాదు.. ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది.

ఇక ముందు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర

తెలంగాణ అనే మాట వినిపిస్తే ముందుకు గుర్తుకు వచ్చేది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నంతగా స్వరాష్ట్ర ఉద్యమాన్ని శ్వాసించిన ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ వెనక్కి తగ్గకుండా వెరవకుండా పోరాడి అంది వచ్చిన అవకాశాల్ని ఉద్యమసోపానాలుగా మార్చుకుని కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టి తెలంగాణ ప్రజానీకాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలపై యుద్ధం ప్రారంభించారు. రాజకీయాలపై కేసీఆర్‌కు స్పష్టమైన రూట్ మ్యాప్ ఉందని అనుకోవచ్చు. కేసీఆర్ టైమింగ్ అనితర సాధ్యం. ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఫెయిలైన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఈ రెండు దశాబ్దాలు తెలంగాణ కోసం ఆయన రాజకీయం అనుకుంటే.. ఇక నుంచి దేశం కోసం ఆయన రాజకీయం చేయబోతున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీని గంట తిట్టి “ధాన్యం భారం” దించేసుకున్న కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం బీజేపీని...

వరద నష్టం అంచనాకొచ్చారా ? జగన్ పనితీరుకా ?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు...
video

30 సెకన్ల టీజర్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన రాధేశ్యామ్

https://youtu.be/ybq28UyxDTg పాన్ ఇండియా ఫ్యాన్స్ ని ఊరిస్తున్న సినిమాల్లో ప్రభాస్ "రాధేశ్యామ్" కూడా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రమోషన్స్ మెటిరియాల్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా హిందీ సాంగ్...

డ్వాక్రా మహిళల “పెన్షన్ బీమా” సొమ్ములు కూడా విత్ డ్రా !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close