అసలు తెలుగే లేకుండా చేస్తూంటే.. కొత్తగా బోర్డు గురించి వివాదమా..!?

తెలుగు అకాడెమీ పేరును తెలుగు, సంస్కృత అకాడెమీగా మార్చిన ఏపీ ప్రభుత్వం అందులో కొత్తగా పదవుల్ని కొంత మందికి కట్టబెట్టింది. తెలుగు అకాడెమీ చైర్మన్‌గా పదవి కట్టిబెట్టి.. లక్ష్మిపార్వతికి చాలా కాలంగా నుంచి జీతభత్యాలు ఇస్తున్నారు. ఇప్పుడు.. పేరు మార్చి ఆమెకు సంస్కృతం కూడా ఇచ్చారు. తెలుగు- సంస్కృతం రెండు కలిపిన అకాడెమీగా మార్చారు. సంస్కృతం అంటే ఇప్పుడు ఇంటర్ మీడియట్ విద్యార్థులకు తెలుగులోనే తెలుసు. తెలుగులోనే సంస్కృతాన్ని రాసి.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా.. తెలుగే సంస్కృతం అనుకుందేమో కానీ… విడివిడిగా బోర్డులెందుకని ఒక్క బోర్డులోనే రెండింటిని కలిపేసింది.ఖర్చు తగ్గించుకుంది.

దీనిపై భాషాభిమానులు రగిలిపోతున్నారు. ఇదేం పద్దతని అంటున్నారు. తెలుగు భాషను చరిత్రలో లేకుండా చేసే కుట్ర జరిగిపోతోందని బాధపడుతున్నారు. కానీ చాలా మందికి ప్రభుత్వం తీరుపై ఆశ్చర్యం కలగడం లేదు. ఎందుకంటే.. అసలు తెలుగు నేర్పించడమే మానేయాలని ఎప్పుడో ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. మొత్తం ఇంగ్లిష్ మీడియం అని చెబుతోంది. అప్పుడు కూడా ఇంతగా గగ్గోలు పెట్టలేదు మేధావులు. ఇంగ్లిష్‌లో చదువుతేనే ఉద్యోగాలొస్తాయని.. రోబోటిక్స్ గురించి తెలుసుకోవచ్చని సీఎం జగన్ చెబితే…బాగు బాగు అని భజన చేశారు కానీ.. మాతృభాష గొప్పదనం.. తెలుగుకు పట్టే అవసాన స్థితి గురించి మాత్రం పెద్దగా ఎవరూ చర్చించలేదు. పైగా నిండు సభలో.. తెలుగుకు కులం ఆపాదిస్తే.. కొంత మంది నవ్వుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు..వారి సలహాదారులు.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ప్రముఖులు ఎవరికీ.. తెలుగు పట్ల కొంచెమైనా సదభిప్రాయం ఉందని.. ఎవరూ అనుకోరు. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. తెలుగునే లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వం ఇప్పుడు తెలుగు అకాడెమీని కూడా నిర్వీర్యం చేయాలనుకోవడం.. ఊహించకుండా వచ్చి పడిన ఉత్పాతం ఏమీ కాదు. మొదట్లోనే స్పందించి.. తెలుగును కాపాడుకోవాలన్న ఆలోనచ చేసి ఉంటే.. ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు.. వగర్చి ప్రయోజనం లేదు. తెలుగుపై ఎప్పుడైనా ప్రభుత్వ పెద్దలు కులముద్రవేశారో.. అప్పుడే భాష అంతర్థానం అయిపోయింది. ఇప్పుడు తెలుగు లేదు.. అంతా తెగులే. దానికి అకాడెమీ ఉన్నా లేకపోయినా… సంస్కృతంలో కలిపేసి ఉన్నా ఒక్కటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close