తొలి తెలుగు పాప్ గాయనిగా పాపులర్ అయ్యారు స్మిత. తెలుగు పాత పాటలను పాప్ స్టయిల్ రీమిక్స్ చేసి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా మసక మసక చీకట్లో పాట సోషల్ మీడియా లేని కాలంలోనే వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె మ్యూజిక్ కి దూరమయ్యారు. ఏవో భక్తి పాటలు చేశారు. మల్లీశ్వరి సినిమాలో ఓ విలన్ క్యారెక్టర్ కూడా చేశారు. కానీ అది ఆమెకు కలిసిరాలేదు. ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి బిజీ అయ్యారు.
అయితే ఇప్పుడు ఆమె దృష్టి తెలుగు పాప్ మ్యూజిక్ మీద పడింది. ఓజి× మసక మసక పేరుతో ఓ పాటని విడుదల చేశారు. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్ కి విజయ్ బిన్నీ డైరెక్టర్. ఇక వరుసగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు స్మిత. ‘2026 లో నా లైఫ్ లో కేవలం మ్యూజిక్ మాత్రమే వుంటుంది. ఇకపై వరుసగా పాటలు రాబోతున్నాయి. హైదరాబాద్, ఆంధ్రా, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లో లైవ్ షోస్ ప్లాన్ చేస్తున్నాం’ అని ప్రకటించింది స్మిత.
నిజానికి స్మిత తర్వాత తెలుగులో మళ్ళీ పాప్ కల్చర్ లో మ్యూజిక్ చేసిన ఆర్టిస్టిలు లేరనే చెప్పాలి. ఆ జానర్ మ్యూజిక్ లో ఒక గ్యాప్ వుంది. ఆ గ్యాప్ ని మళ్ళీ స్మితనే భర్తీ చేసేలా కనిపిస్తోంది.
New
