సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ ట్రైలర్ బయటికి వచ్చింది. ఇప్పటివరకూ లవ్ స్టొరీ అనే కోణంలో ప్రమోషన్స్ జరిగాయి. ట్రైలర్ మాత్రం షాక్ ఇచ్చింది. ఇదొక క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. హీరో క్యారెక్టర్ లో వున్న గ్రే షేడ్ ఇందులో యూనిక్ పాయింట్. రిలేషన్షిప్ లో పవర్, కంట్రోల్ తన చేతిలోనే ఉండాలకునే హీరో జీవితంలో ప్రేమ, రోమాన్స్, ఎమోషన్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ.
లవ్ ట్రయాంగిల్ లా కనిపించినప్పటికీ మేల్ ఇగో ఇందులో కీలక పాయింట్. నీరజ కోన రెగ్యులర్ కి భిన్నంగా వుండే పాత్రనే పట్టుకుంది. కథలో మెయిన్ ఎలిమెంట్ మాత్రం ట్రైలర్ రిలిల్ చేయలేదు. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ కొత్తగా వుంది. వైవా హర్షాతో సిద్దు చెప్పే డైలాగ్స్ ట్రైలర్ లో హైలెట్. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ కూడా డిఫరెంట్ గా వుంది. థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైవ్లీగా వుంది.
ట్రైలర్ కట్ లో యూనిక్ నెస్ కనిపించింది. ఈ రోజుల్లో క్యారెక్టర్ బేస్డ్ సినిమాలకి గిరాకీ వుంది. క్యారెక్టర్ క్లిక్ ఐతే మామూలు కథ కూడా ఆడేస్తుంది. డిజే టిల్లు లాంటి మ్యాజిక్ ఇందులో వరుణ్ క్యారెక్టర్ కూడా కుదిరితే… తెలుసు కదా వర్క్ అవుట్ అయిపోయినట్లే.