ప‌వ‌న్ కోసం త‌మ‌న్ ‘గీత’ సాయం

మన న‌దుల్నీ భాష‌నీ కాపాడుకోవాల‌ని పిలునిస్తూ… జ‌న‌సేన `మ‌న న‌ది – మ‌న నుడి` అనే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. న‌దుల ప‌ర్య‌ర‌క్ష‌ణ‌, మాతృభాష ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌న‌సేన కొన్ని కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌నుంది. ఈ విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఓ పాట‌ని రూపొందించింది శ‌త‌ఘ్ని టీమ్‌. ఈ పాట‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ స్వ‌రాన్ని స‌మ‌కూర్చారు. రామ‌జోగయ్య శాస్త్రి క‌లం క‌దిలించారు.

జ‌న‌జ‌న‌జ‌న జ‌న‌సైనికులారా
త‌రలిరండి ప‌ల్లె నుండి ప‌ట్నం నుండి
జ‌న‌జ‌న‌జ‌న‌సైనికులారా
మ‌న న‌దినీ మ‌న నుడినీ కాపాడ‌గ‌రండి

అంటూ సాగే ఈ గీతంలో న‌దుల విశిష్ట‌త‌నీ, మాతృభాష అవ‌స‌రాన్ని, ఇప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన క‌ర్త‌వ్యాన్నీ భోదించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ తెలుగు సినిమాలో ఓ మంచి పాట‌కు ఉండే అర్హ‌త‌ల‌న్నీ ఈ పాట‌కు ఉన్నాయి. ఎప్ప‌టిలానే త‌మ‌న్ మంచి బీట్ ఉన్న పాట‌ని అందించాడు. తొలి చ‌ర‌ణంలో న‌దుల గురించి, రెండో చ‌ర‌ణంలో భాష గొప్ప‌ద‌నం గురించి అవ‌గాహ‌న క‌లిగించారు. వ‌కీల్ సాబ్ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కోసం 5 పాట‌ల్ని కంపోజ్ చేశాడు. ప‌నిలో ప‌నిగా ఈ పాట‌నీ ప‌వ‌న్‌కి కానుక‌గా ఇచ్చేసిన‌ట్టున్నాడు. ప‌వ‌న్ అంటే త‌మ‌న్‌కి చాలా ప్రేమ‌. అందుకోసం చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ పాట‌ని కంపోజ్ చేసి, రికార్డింగ్ చేసి పెట్టాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close