పేదలకు బతుకుపై భరోసా..! కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యమేనా..?

కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ మేనిఫెస్టోను ప్రకటించింది. న్యాయ్ పథకం ద్వారా పేదలకు ఏడాదికి 72 వేల రూపాయల చొప్పున అందిస్తామన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి కీలకాంశం. అధ్యయనం చేసి, అర్థం చేసుకున్న తర్వాత ఆచరణ సాధ్యమని గ్రహించి ఈ పథకాన్ని ప్రకటించామని రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ప్రధానంగా ఐదు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదటి అంశం న్యాయ్‌కు సంబంధించినది. రెండోది ఉద్యోగాల భర్తీ. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నది రెండో హామీ. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తూ… ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామి హామీ ఇచ్చారు.

రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకురావడం మూడోది. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారిని వదిలేస్తున్నారని, పేద రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. ఇకపై రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించబోమని, వాటిని సివిల్ కేసులుగా లెక్కగడతామని రాహుల్ స్వయంగా చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తారు. స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యా రంగానికి కేటాయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అందరికీ అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. విద్యాలయాల్లో తగిన మౌలిక సదుపాయాలతో పాటు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల్ని నియమిస్తామన్నారు. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ఐదో కీలక హామీ. ప్రస్తుతం పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రైవేటు బీమా సంస్థలకు చెల్లించే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలకు మేలైన వైద్య సేవలు అందిస్తామన్నారు.

అధికారంలోకి రాగానే రఫేల్‌ ఒప్పందం మీద విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మోదీ ప్రోత్సాహంతోనే ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రజల వాక్కు విన్న తర్వాత, వారి ఆలోచనా విధానం తెలుసుకున్న తర్వాతే మేనిఫెస్టో రూపొందించారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో సిద్ధం చేశారు. దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందని, సమస్యల నుంచి జనాన్ని గట్టెక్కించడమే తమ కర్తవ్యమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. గబ్బర్ సింగ్ టాక్స్‌ను మళ్లీ జీఎస్టీగా మార్చుతామని కాంగ్రెస్ చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

మారువేషంలో జగన్ దగ్గరే జడ్జిలపై దూషణల కేసు నిందితుడు !

హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో...

నిర్వాసితుల క‌న్నీటికి స‌మాధానం ఉందా…? బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై వైర‌ల‌వుతోన్న పోస్ట్!

మా క‌న్నీటికి నీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? మ‌మ్మ‌ల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెల‌వ‌గ‌ల‌వా...? బ‌త‌కొచ్చినంత మాత్రాన నువ్వు లోక‌ల్ ఎట్లా అయిత‌వ్...? ఇలాంటి ప‌దునైన మాట‌ల‌తో మెద‌క్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,...

హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సహజం... కానీ తెలంగాణ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణియంచుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close