మహేష్ గ్రీన్ సిగ్నల్ ఎవరికి ..?

శ్రీమంతుడు ఆడియోలో మహేష్ బాబుతో తాను 100 కోట్ల సినిమా చేస్తా అని బాహాటంగా ఒప్పుకున్నాడు వి.వి.వినాయక్. ప్రస్తుతం అఖిల్ సినిమా చేస్తున్న వినాయక్ మహేష్ కు కథ సిద్ధం చేసేందుకు టాలీవుడ్ టాప్ రైటర్స్ తో మీటింగ్ ఏర్పరచుకున్నాడట. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం చేస్తున్నాడు ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి కల్లా కానిచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. సినిమా లేట్ గా స్టార్ట్ అయిన కారణం చేత సంక్రాంతికి కష్టమే అని తేలిపోయింది.

మహేష్ రూల్ ప్రకారం ఒక సినిమా చేస్తుండగా మరో సినిమా ఎనౌన్స్ చేయడు. అయితే ఇప్పటికే మహేష్ బాబు తన తర్వాత సినిమా ఇష్క్, మన లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం సూర్య 24 సినిమా చేస్తున్న విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ ను విక్రమ్ కలిసిన మాట వాస్తవమే అయినా వీరిద్దరు కలిసి సినిమా చేయడం అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు.

ఓ పక్క త్రివిక్రమ్ కూడా నితిన్ తో సినిమా చక చకా చేసి మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. మరి ఇంతమంది దర్శకుల్లో మహేష్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం మాత్రం బ్రహ్మోత్సవంలో సమంత, కాజల్, ప్రణీత.. ఒకేసారి ముగ్గురు భామలతో మాంచి రొమాన్స్ చేస్తున్నాడు మన సూపర్ స్టార్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండే ఆప్షన్స్ : పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో ఇచ్చిన ఒకే ఒక్క రియలిస్టిక్ హామీ పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రతీ పైసా భరిస్తామని చట్టంలో పెట్టారు. కానీ ప్రత్యేకహోదాను ఎలా చేశారో.....

పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత...

రివ్యూ: క‌ల‌ర్ ఫొటో

తెలుగు360 రేటింగ్ : 2.75/5 సినిమా ప్రేమ‌ల‌కు ఎన్ని అవ‌రోధాలో. కులం, డ‌బ్బు, మ‌తం, ప్రాంతం, దేశం - అన్నీ అడ్డుప‌డుతుంటాయి. వాట‌ని దాటుకుని ప్రేమికులు ఎలా క‌లిశార‌న్న‌దే క‌థ‌లవుతుంటాయి. ఇప్పుడు ఈ...

రైతు ఉద్యమానికి తలొగ్గిన కేసీఆర్..!

సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తొలి సారి వెనక్కి తగ్గారు. తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. నిన్నటి వరకూ కేసీఆర్... మక్కలకు...

HOT NEWS

[X] Close
[X] Close