ఆస్పత్రి పాలవుతున్న యువహీరోలు..! టాలీవుడ్‌కు టైం బాలేదా..?

టాలీవుడ్ యువ హీరోలు.. వరుసగా ఆస్పత్రి పాలవుతున్నారు. వరుసగా.. ముగ్గురు… ప్రమాదాలకు గురయ్యారు. విశాఖలో నాగశౌర్య, కర్నూలులో సందీప్ కిషన్, థాయ్‌లాండ్‌లో శర్వానంద్ ప్రమాదాలకు గురయ్యారు. ఇవన్నీ.. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. అందరికీ… కాస్త తీవ్రమైన దెబ్బలే తగలడంతో.. షూటింగులన్నీ ఎక్కడివక్కడ నిలిపి వేయాల్సి వస్తోంది.

శర్వానంద్ భుజనికి ఆపరేషన్..!

థాయ్ లాండ్‌ షూటింగ్‌లో శర్వానంద్.. తీవ్రంగా గాయపడిన విషయం.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శర్వానంద్.. తమిళ రీమేక్ మూవీ 96లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ స్కైడైవింగ్ సీన్ చేయబోయిన శర్వానంద్ పట్టు తప్పి కింద పడిపోయాడు. భుజానికి తీవ్ర గాయం కావడంతో.. అక్కడే ప్రాథమిక చికిత్స చేయించుకుని.. హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ సన్‌షైన్ ఆస్పత్రిలో చేరారు. గాయం తీవ్రంగా ఉండటంతో.. భుజానికి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. దీంతో.. 96 సినిమా షూటింగ్.. నెల రోజుల పాటు ఆగిపోయే అవకాశం ఉంది. శర్వానంద్‌ గాయం విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మరో ఇద్దరు యువహీరోలు.. ఏపీలో షూటింగ్‌లలో పాల్గొంటూ.. ప్రమాదాలకు గురయ్యారు. సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో.. ఫైట్ సీన్ చేస్తూ.. నాగసౌర్య… సాహసం చేయడంతో.. పరిస్థితి చేయిదాటిపోయింది. కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. రెండు నెలల పాటు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లయింది.

వరుసగా ఇంత మంది హీరోలకు ప్రమాదాలా..?

సందీప్ కిషన్ కూడా… గాయపడిన యువహీరోల జాబితాలో ఉన్నారు. ఆయన కర్నూలులో తెనాలి రామకృష్ణ.. అనే సినిమా షూటింగ్‌ కోసం బ్లాస్టింగ్ సీన్‌లో పాల్గొంటూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అంతకు ముందు.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. షూటింగ్‌లో.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ ఇద్దరికీ గాయాలయ్యాయి. అందులో.. ఆసినిమా షూటింగ్ వాయిదా పడింది. చాణక్య మూవీ షూటింగ్‌లో సీనియర్ హీరో గోపిచంద్ సైతం గాయపడ్డాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గాయపడ్డాడు. హీరో వరణ్ తేజ్ .. షూటింగ్‌కు వెళ్తూ.. ప్రమాదం బారి నుంచి తృటిలో బయటపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close