హీరోయిన్ వ‌ల‌లో… నిర్మాత త‌న‌యుడు

అత‌నో పేరు మోసిన నిర్మాత త‌న‌యుడు. త‌ను కూడా నిర్మాత‌గా, స‌హ నిర్మాత‌గా, స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలున్నాయి. పేరుకు తండ్రే నిర్మాత అయినా… ఆ బాధ్య‌త‌ల‌న్నీ తానే చూసుకుంటుంటాడు. రెండో బ్యాన‌ర్ కూడా స్థాపించి సినిమాలు తీస్తున్నాడు కూడా. అయితే.. ఇప్పుడు ఆ యువ నిర్మాత ఓ క‌థానాయిక వ‌ల‌లో పడిన‌ట్టు టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌ద‌రు హీరోయిన్‌తో ఈ సంస్థ ఓ సినిమా చేసింది. అప్ప‌టి నుంచీ.. హీరోయిన్ కీ, నిర్మాత త‌న‌యుడికీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా విడుద‌లై, ఫ్లాప్ అయి.. దాని గురించి మ‌ర్చిపోయారు కూడా. అయితే ఆ బంధం మాత్రం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. హైద‌రాబాద్‌లోని ఓ ఖ‌రీదైన హోటెల్ లో ఆ హీరోయిన్ కోసం ఎప్పుడూ ఓ సూట్ బుక్క‌యి ఉంటోంద‌ట‌. ఆ బిల్లులు మొత్తం నిర్మాత త‌న‌యుడే భ‌రిస్తున్నాడ‌ని, ఆమె కోసం డ‌బ్బుల్ని ధారాళంగా ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ ఓ ట్విస్టేమిటంటే… ఆ హీరోయిన్‌కి ఓ ద‌ర్శ‌కుడితో లింకు చేసి కొన్ని వార్త‌లు పుట్టించారు మీడియా జ‌నాలు. ఆ ద‌ర్శ‌కుడిని ఎప్పుడో సైడ్ చేసేసి.. ఈ నిర్మాత త‌న‌యుడితోనే క‌లిసి ఉంటోంద‌ని చెప్పుకుంటున్నారు. త‌న‌యుడు దారి త‌ప్ప‌డం చూసి ఆ తండ్రి కూడా ల‌బోదిబోమంటున్నాడ‌ని, పైకి చెప్పుకోలేక నానా అవ‌స్థ ప‌డుతున్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close