సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. సినిమాలపై సమ్మె ప్రభావం పడింది. ఇందులో చిరంజీవి సంక్రాంతి సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ కూడా ఉంది. ఈ సినిమా ముందు అనుకున్న షెడ్యూల్ సమ్మె కారణంగా రద్దయింది. దీంతో సంక్రాంతికి అందుకుంటుందా లేదా అనే చర్చ కూడా వచ్చింది.
దీనిపై ఇప్పుడు స్వయంగా నిర్మాత సాహు గారపాటి క్లారిటీ ఇచ్చారు. ‘సమ్మె కారణంగా 15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది. అయితే ఆర్టిస్టులందరూ చాలా సహకరించారు. కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. నవంబర్ 15కి సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాం. సంక్రాంతికి వచ్చేస్తాం’ అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు సాహు.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. అనిల్ సినిమాతో పాటు ప్రమోషన్స్‌కూ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. నవంబర్ నాటికి షూటింగ్ ఫినిష్ అయితే చేతిలో కావాల్సిన సమయం ఉంటుంది. క్రియేటివ్ ప్రమోషన్స్‌తో కావాల్సినంత బజ్ క్రియేట్ చేయొచ్చు. చిరంజీవి, అనిల్ ఇద్దరి కెరీర్లో సంక్రాంతి సీజన్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఈ సీజన్లో వచ్చిన వీరి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘మన శంకరవరప్రసాద్ గారు’పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.