“న్యూడిస్ట్”పై చర్యలు కాదు.. టాపిక్ డైవర్షన్ ప్లాన్ రెడీ ?

గోరంట్ల మాధవ్ వ్యవహారం పై వైసీపీ అధినేత జగన్ సైలెంట్‌గా ఉండటంతో ఆ పార్టీ పాత వ్యూహాన్ని మళ్లీ అమలు చేయబోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీకి ముందు నుంచీ ఓ అలవాటు ఉంది. తమకు ఇబ్బందికరంగా ఏదైనా పరిణామం సంభవించినప్పుడు వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తారు. అందు కోసం తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తారు. అమరావతి కుంభకోణాలు అంటూ నోటీసులు రెడీ చేస్తారు. ఇలాంటి వాటికి సీఐడీ రెడీగా ఉంటుంది. మీడియా అంతా.. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతుంది. ఇంత కాలం జరిగింది అదే.

ఇప్పుడు హిందూపురం ఎంపీ అంశంలోనూ వైసీపీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎంపీపై చర్యలు తీసుకుంటామని .. సస్పెన్షన్ వేటు అని లీకులు ఇచ్చారు. కానీ అసలు అలాంటి ఆలోచనే వైసీపీ పెద్దలకు లేదు. అందుకే ఆయనను ఢిల్లీలో గౌరవంగానే చూసుకుంటున్నారు. అన్ని పార్టీ మీటింగ్‌లకూ పిలుపుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ టాపిక్‌ను మరుగున పడేయడం ఎలా అనే దానిపై మేథోమథనం జరిపారు. టార్గెట్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలెవరో ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశం పూర్తిగా మరుగునపడిపోయేలా టాపిక్ డైవర్షన్ ప్లాన్ అమలవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన వైసీపీ పెద్దలకూ ఎప్పుడూ లేదు. అందుకే వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడూ అలాంటి ఆలోచన లేదు. అంబటి, అవంతి విషయంలో అయినా గోరంట్ల విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఆలోచించే పరిస్థితి లేదు. అయితే టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి మాత్రం పక్కా ప్లాన్ రెడీగా ఉంటుంది. ఇలాంటివి వైసీపీ పెద్దలకు కొట్టిన పిండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close