టీడీపీ, చంద్రబాబుపై ఎనలేని ప్రేమ – ఏపీ బీజేపీకి ఏమయింది ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ తప్పు చేసినా టీడీపీనే విమర్శించేవారు. అప్పట్లో టీడీపీ చేసింది కాబట్టి ఇప్పుడు వైసీపీ చేసిందనేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. వైసీపీనే విమర్శిస్తున్నారు. టీడీపీని పొగుడుతున్నారు. చివరికి సోము వీర్రాజుకూడా అదే పని చేస్తున్నారు. రాజధాని కట్టలేదు అని చంద్రబాబుపై ఎగిరెగిరిపడే సోము వీర్రాజు ఇప్పుడు చంద్రబాబు దార్శనికుడని అందుకే రాజధానికి డబ్బులిచ్చామని అంటున్నారు. ఇక వైసీపీపై బీజేపీ నేతలు చేసిన మాటల దాడితో హర్టయిన వైసీపీ నేతలు.. బీజేపీని బాబు జనతా పార్టీ అనడం ప్రారంభించారు.

మరో వైపు వైసీపీ నేతలు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ బీజేపీ నేతల్ని విమర్శిస్తున్నారు. చివరికి మోదీని కూడా వదిలి పెట్టడంలేదు. మోదీ కన్నా జగన్ పాలనే బెటరని విజయసాయిరెడ్డి లాంటినేతలంటున్నారు . రాజకీయంగా ఇదంతా అనూహ్య మార్పులకు కారణం అవుతోంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి కూడా వైసీపీ కాకుండా టీడీపీ విషయంలో బీజేపీ ఫేవర్‌గా ఉందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు .. టీడీపీతో టచ్‌లోకి వస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తర్వాత సీన్ మారినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు .. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అక్కడ మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతారన్న చర్చ జరుగుతోంది.

మరో వైపు తాము ఎంతగా సహకరిస్తున్నా.. రాజకీయంగా బలపడేందుకు బీజేపీ తమ డిమాండ్లు నేరవేర్చేడం లేదన్న అభిప్రాయం వైసీపీలో ప్రారంభమైనట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. బీజేపీతో శత్రుత్వం పెంచుకున్న టీడీపీ.. ఇప్పుడు మిత్రులుగా మారకపోయినా కనీసం న్యూట్రల్‌గా అయినా ఉండేలా సంబంధాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇది వైసీపీకి నచ్చడం లేదు. ఆ పార్టీ బీజేపీకి దూరమయ్యేందుకు ప్రయత్నం చేయడమో లేకపోతే.. బ్లాక్ మెయిలింగ్ లాంటి రాజకీయం చేయడమో చేస్తోందని అంచనాలు వస్తున్నాయి. మొత్తంగా టీడీపీని.. బీజేపీ చూసే కోణంలో స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close