పుష్ష ఐటెమ్ గాళ్‌… దొరికేసింది!

సుకుమార్ సినిమాల్లో స్క్రీన్ ప్లే త‌ర‌వాత‌, ఐటెమ్ పాటే హైలెట్టు. ‘ఆ అంటే అమ‌లాపురం’ ద‌గ్గ‌ర్నుంచి ‘ఊ అంటావా’ వ‌ర‌కూ ఆయ‌న ఇచ్చిన అన్ని పాట‌లూ హిట్టే. మిగిలిన సినిమాల్లో ఐటెమ్ పాట వేరు, సుక్కు సినిమాల్లో ఐటెమ్ వేరు. సుకుమార్ అన‌గానే దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా ఇర‌గ‌బ‌డి, ట్యూన్లు ఇచ్చేస్తుంటాడు. అందుకే అంద‌రి దృష్టీ ఐటెమ్ పాట మీద ఉంటుంది. ‘పుష్ష 2’లోనూ అదిరిపోయే ఓ ప్ర‌త్యేక గీతం ఉంది. మ‌రి ఆ పాట‌లో క‌నిపించే క‌థానాయిక ఎవ‌రు? అంటూ చాలాకాలంగా టాలీవుడ్ ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకొంటోంది. ఈలోగా చాలామంది క‌థానాయిక‌ల పేర్లు కూడా వినిపించాయి. జాన్వీక‌పూర్ ఐటెమ్ గాళ్ గా మెర‌వ‌డం ఖాయం అనుకొన్నారు. ఇప్పుడు ‘యానిమ‌ల్‌’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

‘యానిమ‌ల్’ రిలీజ్ అవ్వ‌గానే పుష్ష టీమ్ త్రిప్తి పేరుని ఐటెమ్ గాళ్ లిస్టులో చేర్చింది. కానీ…ఖాయం చేయ‌లేదు. మ‌ధ్య‌లో చాలామంది పేర్లు ప‌రిశీలించాక‌, చివ‌రికి త్రిప్తి అయితేనే బాగుంటుంద‌ని సుకుమార్ టీమ్ భావించింది. త్వ‌ర‌లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట‌ని తెర‌కెక్కించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ అక్క‌డే జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం మ‌లేషియా సెట్ ని ఫిల్మ్‌సిటీలోనే తీర్చిదిద్దారు. మిగిలిన షూటింగ్ అంతా ఈ సెట్లోనే జ‌ర‌గ‌బోతోంది. ఐటెమ్ గీతాన్నీ ఇక్క‌డే పూర్తి చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

మోదీకి చెక్ పెట్టేలా ఆరెస్సెస్ వ్యూహం !

ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే...

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ ?

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close