టీఆర్ఎస్సా ? బీజేపీనా ? షర్మిల ఎవరు వదిలిన బాణం ?

తెలంగాణలో రెండు రోజులుగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ అవుతున్నారు. ఆమె పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది. టీఆర్ఎస్ షర్మిల పార్టీని బీజేపీ వదిలిన బాణం అని అంటోంది. బీజేపీ షర్మిలకు మద్దతు తెలుపుతోంది. ఈ రాజకీయం ఏమిటో కానీ.. షర్మిలను బేస్ చేసుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేయడం ఆసక్తి రేపుతోంది.

షర్మిల పాదయాత్రను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లోనే కాదు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. అందుకేనే ఆమె దుర్భాషల బాట ఎంచుకున్నారు. పాదయాత్రలో టీఆర్ఎస్ నేతలను తిట్టడం ప్రారంభించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ నర్సంపేట వచ్చే సరికి దాడులు చేశారు. తర్వాత హైదరాబాద్‌లో సీన్ క్రియేట్ చేశారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రోత్సాహమేనని చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి రాజకీయం చేయడంలో టీఆర్ఎస్ స్టైలే వేరు. అందుకే కావాలనే షర్మిలకు టీఆర్ఎస్ ఎలివేషన్ ఇచ్చిందని రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.

అయితే అనూహ్యంగా షర్మిలకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. ఆమె విషయంలో ప్రభుత్వం తీరును ఖండిస్తోంది. గవర్నర్ స్వయంగా మద్దతు పలికారు. ఈ క్రమంలో గవర్నర్‌ను షర్మిల కలవనున్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు ఆమెను బీజేపీ వదిలిన బాణం అంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యతిరేక ఓటును షర్మిల రెండు, మూడు శాతం చీల్చినా చాలు టీఆర్ఎస్‌కు మేలేనని అందుకే టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని అంటున్నారు. అదే సమయంలో షర్మిల పార్టీకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ కాబట్టి.. ఆమెకు మద్దతుగా నిలవడం ద్వారా ఆ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మరో వర్గం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆన్‌లైన్‌కి ఎక్కిన మంచు బ్రదర్స్ గొడవలు !

మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయని అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని మంచు మనోజ్ బయట పెట్టారు . తన దగ్గర పని చేసే ఓ...

సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే...

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close