తల్లిని గెంటేసిన బిడ్డ ఆక్రందనలు !

” ఓ కోర్టులో తల్లిదండ్రుల్ని హత్య చేసిన ఓ బిడ్డ కేసు విచారణ జరుగుతోంది. తల్లిదండ్రుల్ని హత్య చేశావా అని జడ్జి నిందితుడ్ని అడిగాడు. అవునని అంగీకరించాడు అతను. చివరిగా వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే సమయంలో .. ఆ నిందితుడ్ని జడ్జి అడిగాడు.. చివరిగా చెప్పుకునేది ఏమైనా ఉందా ? అని. తల్లిదండ్రులు లేని అనాథని బాబయ్యా.. కాస్త కనికరించండి అని వేడుకున్నాడట ఆ నిందితుడు. ఆ కరుడు గట్టిన నిందితుడి మాటలు విని జడ్జికి అక్కడే మూర్చవచచినంత పనైంది.. ” ఇది ఓ సెటైరిక్ కథే కానీ.. ఏపీలో ఇప్పుడు ఇలాంటి ఓ అనాథ బిడ్డ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

మీ బిడ్డకు తోడుగా ఉండండి అంటూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగసభల్లో సెంటిమెంట్ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డనని… మీ బిడ్డనని అదే పనిగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఆయన స్వయంగా ఎవరి బిడ్డో.. ఆ తల్లి మాత్రం ఇప్పుడు తెలంగాణ రోడ్లపై ఆవేదన చెందుతోంది. ఆ రాష్ట్రంతో.. జగన్మోహన్ రెడ్డితో మనకేంటి సంబంధం అని నిర్మోహమాటంగానే చెబుతోంది. అంటే.. తన బిడ్డనే .. ఆ తల్లి వదులుకుంది. కానీ ఆ బిడ్డ మాత్రం… మిగతా ప్రజంలదర్నీ తనను బిడ్డలాగా చూసుకోమని బతిమాలుతున్నాడు. తల్లే అలా అనేసిందంటే.. ఆయన ఎంత చేసి ఉండాలి ? ప్రజలకు ఇంకెంత చేసి ఉండాలి ?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజన్న బిడ్డనని.. కేసుల్లో ఇరికించారని.. చంపబోయారని కోడికత్తి డ్రామాలు ఆడి.. తప్పుడు ప్రచారాలు చేసి అధికారాన్ని సాధించగలిగారు. కానీ నిలబెట్టుకోవడానికి ఇంకా చాలా చేయాలి. అధికారం అందిందని చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల్ని నిజంగానే ఈ బిడ్డ బాగా చూసుకున్నాడా.. అంటే.. ఇప్పుడు ఇంత టెన్షన్ పడాల్సింది ఏముంది. సొంత ఆదాయం కోసం మద్యం ఆదాయం పెంచి పేదలను ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అందకుండా చేశారు. ప్రతీ విషయంలోనూ పన్నులు బాదేశారు. చిటికెంత అభివృద్ధి లేదు. సంక్షే్మంలోనూ ఎన్నో కోతలు. ఇప్పుడు కొత్త బిడ్డ అంటూ సెంటిమెంట్ ప్రయోగాలు.

బిడ్డనని.. చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆత్రం చూసి.. జనాలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్లతో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు రాలతాయనుకుంటే… అమాయకత్వమేనని.. మంచి పాలన చేయకుండా.. ప్రజల్ని పట్టించుకోకుండా ఇప్పుడిలా బతిమాలుకుంటే ప్రయోజనం ఏమిటన్న నిట్టూర్పూ..సహజంగానే ఆయన సానుభూతిపరుల్లోనూ వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close