మ‌రో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మౌతున్న తెరాస‌..!

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల‌కు మ‌ళ్లీ రంగం సిద్ధ‌మౌతోంది. గ‌త డిసెంబ‌ర్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో హ‌డావుడి మొద‌లైంది. త‌రువాత‌, లోక్ స‌భ ఎన్నిక‌లు, పంచాయతీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు… ఇలా వ‌రుస‌గా ఎన్నిక‌ల వాత‌వ‌ర‌ణ‌మే రాష్ట్రంలో నెల‌కొని ఉంది. తాజాగా రాష్ట్రంలో 32 జిల్లా ప‌రిష‌త్ ల‌ను కైవ‌సం చేసుకుని, అధికార పార్టీ తెరాస మంచి జోష్ మీదుంది. ఇదే ఊపులో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ని కూడా ముగించేద్దామ‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. జిల్లా ప‌రిష‌త్ లు మాదిరిగానే అన్ని మున్సిప‌ల్స్ లోనూ తెరాస‌కు విజ‌యం ద‌క్కేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు పార్టీ సిద్ధ‌మౌతోంది.

ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ చ‌తికిల‌ప‌డి ఉన్నాయి. వ‌రుస ఓట‌ముల నుంచి కోలుకునే ప‌రిస్థితుల్లో లేవు. కాబ‌ట్టి, ఇలాంటి స‌మ‌యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగితే… ఆయా పార్టీల‌పై గెలుపు సులువు అవుతుంద‌నేది తెరాస అంచ‌నా. మున్సిపాలిటీల కాల ప‌రిమితి వ‌చ్చేనెల‌తో ముగుస్తుంది. అక్క‌డి నుంచి మ‌రో నెల‌న్న‌ర లేదా రెండు నెల‌ల్లోపు ఎన్నిక‌ల‌ను పూర్తి చేయాల‌నేది ప్ర‌భుత్వం ఆలోచ‌న‌. అయితే, ఈ లోగానే కొత్త మున్సిప‌ల్ చ‌ట్టం తెస్తామంటున్నారు. దానికోసం మ‌రో నెల‌కుపైగా క‌స‌ర‌త్తు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈలోగానే పార్టీ శ్రేణుల‌ను ఎన్నిక‌ల‌కు సిద్ధం చేయాలంటూ సీఎం కేసీఆర్ ముఖ్య నేత‌ల‌కు సూచించిన‌ట్టుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ ఎన్నిక‌ల్ని కూడా ముగించేసుకుంటే సాధార‌ణ ప‌రిపాల‌న‌పై పూర్తిగా దృష్టిపెట్టొచ్చు అనేది సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. వాస్త‌వానికి, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక పాల‌న‌పై కేసీఆర్ స‌ర్కారు స‌రైన దృష్టిపెట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే రైతుల స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. వివిధ శాఖ‌ల‌కు మంత్రులు లేని ప‌రిస్థితి. మంత్రివ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌ల మీద ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌న్న వ్యూహంతో కేబినెట్ కూర్పును కూడా కేసీఆర్ వాయిదా వేశారు. కీల‌క నేత‌ల్ని పార్టీ న‌డిపించే ప‌నుల్లో నిమ‌గ్నం చేశారు. కార‌ణాలు ఏవైతేనేం, సాధార‌ణ ప‌రిపాల‌న మీద కేసీఆర్ స‌ర్కారు కాస్త నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ని కూడా ముగించేస్తే అన్నీ అయిపోయిన‌ట్టే. మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కూడా తెరాస‌కు విజ‌యం సాధించుకుంటే… ఆ త‌రువాత‌, ప‌రిపాల‌న‌పై పూర్తిస్థాయి శ్ర‌ద్ధ పెట్టొచ్చు అనేది సీఎం ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close