దుబ్బాక ప్రజలకు హామీలే హామీలు..!

దుబ్బాక ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లు ఆ అంశాన్ని తమ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకుంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు డిమాండ్ల పై సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దుబ్బాక ప్రజల మొదటి డిమాండ్ రెవిన్యూ డివిజన్. దుబ్బాకలో ఇప్పటికే దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి మండలాల వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం ఉంది. డివిజన్ కేంద్రం ఏర్పాటు తో ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

దుబ్బాక పట్టణంలో ఎక్కువ మంది జీవనోపాధి చేనేత వృత్తి ద్వారా పొందుతారు. అందుకే టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. చేనేత కార్మికులకు ఉపాధి కరువై సిరిసిల్ల, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, బీవండి, షోలాపూర్, ప్రాంతాలకు వలస వెళుతున్నారు. టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నిజానికి దుబ్బాకలో టెక్స్ టైల్ పార్క్ పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే వందపడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పినా పూర్తి కాలేదు.

ఈ సమస్యలన్నింటినీ ప్రజలు నేతల ముందు ఉంచుతున్నారు. అధికార పార్టీ మంత్రి హోదాలో మంత్రి హరీష్ రావు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. వాటితో పాటు మరింత అభివృద్ధి చేస్తానని.. దుబ్బాకను మరో సిద్దిపేటను చేస్తానని చెబతూ వస్తున్నారు. అయితే విపక్ష నేతలు మాత్రం.. మొన్నీ మధ్య ఉపఎన్నిక జరిగిన హుజూర్ నగర్‌లో ఏం చెప్పారు.. ఏం హామీలు అమలు చేశారో చెప్పాలని.. అంటున్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ లో గెలిస్తే.. ప్రశ్నించడానికి కూడా నోరు తెరవనివ్వరని హెచ్చరిస్తున్నారు. అయితే.. ప్రజలు మాత్రం ఎప్పటిలానే… గెలిపిస్తే హామీలు నెరవేరుస్తారేమోనని ఆశ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close