ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అయితే అందరికీ కాదు. జర్నలిస్టులకు మాత్రమే. దాదాపుగా 38 మంది జర్నలిస్టులు ఏపీలో చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షలు ఇచ్చేందుకు జగన్అంగీకరించారని జర్నలిస్టు సంఘాల నేత కే.శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. కరోనా బారిన పడిన జర్నలిస్టుల్ని ఆదుకోవాలంటూ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో 38 మంది జర్నలిస్టులు చనిపోయినట్లుగా సమాచారం ఉందని..అందరి కుటుంబాలకు .. రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కరోనా వారియర్స్‌గా జర్నలిస్టుల్ని ప్రకటించినందున రూ. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నామని.. చెప్పుకొచ్చారు.

జర్నలిస్టుగా ఉండి.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా మారిన దేవులపల్లి అమర్ కూడా ముఖ్యమంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉందని దేవులపల్లి అమర్ ముఖ్యమంత్రిని పొగడటానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయితే తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కరోనా బారిన పడిన ప్రతి జర్నలిస్టులుకు రూ. ఇరవై వేల సాయం చేశారు. ఏపీలోనూ అలాంటి సాయం చేయాలని చాలా రోజులుగా జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. దీనిపై జర్నలిస్టు సంఘాల నేతలు అసంతృప్తికి గురైనా లెక్కలోకి తీసుకోలేదు. చివరికి ఐజేయూ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ నుంచి శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగితే.. ఇప్పుడు మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని తక్షణం సాయం చేసి.. ఆ తర్వాత పబ్లిసిటీ చేసుకోవాలన్న సూచనలు.. ఏపీ జర్నలిస్ట్ సర్కిల్స్ నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close