మోదీ పర్యటనకు కేసీఆర్‌ను పద్దతిగా పిలవలేదట.. అందుకే డుమ్మా !

ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఏ కారణం చెబుతారా అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్లుగానే ఎవరూ ఊహించని ఓ కొత్త కారణాన్ని టీఆర్ఎస్.. ప్రభుత్వ వర్గాలు తెరపైకి తెచ్చాయి. అది చాలా వింతగా ఉండొచ్చు. అదేమిటంటే… కేసీఆర్‌ను పద్దతిగా పిలవలేదట. పద్దతిగా అంటే ప్రత్యేకంగా మోదీ ఫోన్ చేసి పిలవాలా అనే సందహం వస్తుంది.. అందుకే ఈ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.

మోదీ వస్తోంది.. రామ గుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి. అందులో తెలంగాణ సర్కార్‌కు పదకొండు శాతం వాటా ఉంది. అందుకే.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ లేఖ తెలంగాణ సర్కార్‌కు వచ్చింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం హోదాలో కేసీఆర్ కూడా పాల్గొనాలనేది ఆ లేఖ సారాంశం. అయితే “పాల్గొనాలి” అని ఎలా అంటారని.. అది మర్యాద కాదని టీఆర్ఎస్ అంటోంది. ప్రోటోకాల్ ప్రకారం ఇంకా పద్దతిగా పిలవాలని.. కేసీఆర్‌ను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపణలు ప్రారంభించాయి. అయితే ఆహ్వానం రాకపోతే సరే కానీ.. పద్దతి ప్రకారం ఆహ్వానంవచ్చినా.. ఇంకా గౌరవంగా రాలేదని చెప్పడం ఏమిటన్న విమర్శలు బీజేపీ వైపు నుంచి వస్తున్నాయి.

ప్రధానితో కలిసి వేదిక మీద ఉండటం ఇష్టం లేకపోతే.. నేరుగా అదే విషయాన్ని చెప్పి ఎగ్గొట్టవచ్చని..ఈ అవమానాల నాటకం ఏమిటని అంటున్నారు. మూడు రోజుల్లో తెలంగాణలో మోదీ పర్యటన ఉండనుంది. ఏపీలో అక్కడ అన్నీ కేంద్ర ప్రాజెక్టులకే ప్రధాని ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడం కాకుండా.. భారీగా జన సమీకరణ కూడా వైసీపీ తరపున చేస్తున్నారు..కానీ తెలంగాణలో మాత్రం.. భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close