ఎల్వీపై టీటీడీ అధికారుల ఆగ్రహం..! ఈవో పద్దతిగా ఇచ్చినకౌంటర్ ఇదే..!

ఎన్నికల సంఘం నియమించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగవర్గాల్లోనే కలకలం రేపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌… తిరుమలకు తీసుకు వచ్చి.. అప్పగించే విషయంలో.. మధ్యలో.. ఎన్నికల అధికారులు పట్టుకోవడం వివాదాస్పదం అయింది. ఈ వివాదంలో .. టీటీడీ తప్పేమీ లేదు. పూర్తిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం. వడ్డీ ఎక్కువ ఇవ్వలేని కారణంగా.. బంగారం డిపాజిట్ గడువు ముగిసిన వెంటనే… బంగారాన్ని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. టీటీడీకి అప్పగించాలని నిర్ణయించుకుంది. అందుకే… 1381 కేజీల బంగారాన్ని… చెన్నై నుంచి తిరుమలకు తరలిస్తూండగా.. ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే సరైన పత్రాలు చూపించలేదన్న కారణంగా రెండు రోజులు.. వారి అధీనంలోనే బంగారం ఉంది. దీనిపై.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అత్యుత్సాహం చూపించారు. తాను టీటీడీ ఈవోగా చేసినప్పటికీ.. ఎలాంటి ఆలోచన చేయకుండా.. విచారణకు ఆదేశించారు. ఓ ఉన్నతాధికారిని కూడా ఈ పనికి పురమాయించారు.

ఎల్వీ తీరు.. టీటీడీ ఉన్నతాధికారుల్లో తీవ్ర అసహనానికి కారణం అయింది. వెంటనే.. టీటీడీ ఈవో.. అశోక్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్ పెట్టి ఎల్వీ పేరు ప్రస్తావించకుండానే… అసలు ఏ మాత్రం సంబంధం లేకపోయినా .. టీటీడీని నిందించడమేమిటన్నట్లుగా మాట్లాడారు. అసలు బంగారం.. తీసుకు వచ్చి.. టీటీడీ ఖజానాకు అప్పగించే బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని.. ఆ బ్యాంక్ ఎలా తీసుకొస్తే.. టీటీడీకి ఏం సంబంధంమని ప్రశ్నించారు. బంగారం తీసుకు వచ్చి ఖజానాలో జమ చేసినప్పుడు మాత్రమే… పీఎన్‌బీ బాధ్యత తీరుతుందన్నారు. అప్పుడే టీటీడీకి బంగారం చేరినట్లని స్పష్టం చేశారు. అసలు సంబంధం లేని అంశంలో.. టీటీడీ నిర్లక్ష్యం ఎలా ఉంటుందని సింఘాల్ ప్రశ్నించారు. ఈసీ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ అధికారులు చెప్పారని…వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో ఎలా తెలుస్తుందన్నారు. బంగారాన్ని వాళ్లు ఎలా తరలిస్తారో… ఏ వాహనంలో తీసుకొస్తారో టీటీడీకి ఎందుకు చెబుతారని ప్రశ్నించారు.

ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌20న బంగారం అందజేశారని బంగారం వచ్చేంత వరకే….మిగిలిన విషయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. బంగారం ఎలా వస్తే ఏంటి? బంగారం మాకు అందిందా అనేది ముఖ్యమన్నార.ు కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామన్నారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని… ఎస్‌బీఐలో 5387 కిలోల బంగారం ఉందన్నారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని లెక్కలు చెప్పారు. మొత్తానికి ఎల్వీ సుబ్రహ్మణం విచారణ అధికారిని నియమించడమే కాదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అత్యుత్సాహంగా ప్రకటన చేయడంతో.. ఉన్నతాధికారులు నొచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close