కేసు కొట్టివేత – మరి తుని రైలును తగులబెట్టిందెవరు ?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల పేరుతో చిచ్చు పెట్టి ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు కరడుగట్టిన రాజకీయ నేతలు. అంతేనా పోలీసులను వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఆ కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును తాజాగా కోర్టు కొట్టి వేసింది. ఎందుకంటే ఒక్క సాక్ష్యం కూడా లేదట.

అదేమిటి కళ్ల ముందే అన్ని సాక్ష్యాలున్నాయి కదా.. ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపులు కూడా ఉన్నాయి కదా.. వైసీపీ నేతల ప్రత్యక్షంగా ఇచ్చిన రెచ్చగొట్టుడు ప్రకటనలు ఉన్నాయి కదా అని చాలా మందికి డౌట్ రావొచ్చు.కానీ ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదు. న్యయమూర్తే ఈ విషయం చెప్పారు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. అసలు నిందితులు 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పేశారు.

ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వారందరూ కేసు నుంచి బయట పడినట్లయింది. మొత్తంగా తుని రైలు ఘటనతో ఎవరి ప్రాణాలు పోలేదు కానీ.. పోయినంత పనైంది. ఓ అరాచకం రాజ్యమేలింది. అలా అరాచకం చేసిన వారంతా స్వేచ్చగా బయటకు వచ్చేశారు. అధికారవర్గాలు కుమ్మక్కు అయితే జరిగేది ఇదే. ఇక ప్రజలకు న్యాయంపై నమ్మకం ఎలా కుదురుతుంది ? అందరూ నిర్దోషులైతే రైలును ఎవరు తగులబెట్టినట్లు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close