ప్రముఖ టివి యాంకర్ , నటి “మల్లిక” కన్నుమూత

“కలిసుందాం రా” సినిమా లో వెంకటేష్ అత్త గా బాగా పాపులర్ అయిన నటి, ప్రముఖ టివి యాంకర్ , టీవీ నటి, “మల్లిక” అనారోగ్యంతో కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ ( ఆమె తొలి చిత్రం), పంచదార చిలక, కలిసుందాం రా, సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.

ఆమె అసలు పేరు అభినవ. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు యాంకర్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.