ఐకాన్ లో ఇద్ద‌రు హీరోయిన్లు?

`పుష్ష‌` త‌ర‌వాత అల్లు అర్జున్ చేయ‌బోయే సినిమా ఏమిటి?  ఎవ‌రితో?  అనే విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. పుష్ష త‌ర‌వాత‌.. `ఐకాన్‌` అని తేలిపోయింది. వేణు శ్రీ‌రామ్ ఈ క‌థ ప‌ట్టుకుని ఎన్నాళ్ల నుంచో తిరుగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు త‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. `పుష్ష` పార్ట్ 1 అవ్వ‌గానే ఐకాన్ మొద‌లైపోతుంది. ఈలోగా… లాంఛ‌నంగా మొద‌లెట్టి, పూజా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించాల‌ని కూడా చూస్తున్నారు. నిజానికి `ఐకాన్‌` ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా. అప్ప‌ట్లో బ‌న్నీ ఈ క‌థ చేయ‌డానికి ధైర్యం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే. అయితే ఇప్పుడు బ‌న్నీ కోసం కొన్ని క‌మ‌ర్షియ‌ల్ ట‌చింగులు ఇస్తున్నారు. పాన్ ఇండియా సినిమాకి కావ‌ల్సిన బ‌లాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇద్ద‌రు హీరోయిన్ల‌కు చోటు క‌ల్పించిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రూ స్టార్ హీరోయిన్లే క‌నిపిస్తార‌ని స‌మాచారం. బ‌న్నీ కోసం బాలీవుడ్ హీరోయిన్ల‌ని రంగంలోకి దింపాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. కుద‌ర‌ని ప‌క్షంలో.. టాలీవుడ్ లోనే లీడ్ లో ఉన్న ఇద్ద‌రు హీరోయిన్ల‌ని ఎంచుకోవాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే హీరోయిన్ల వేట మొద‌లెట్టేశార‌ని టాక్‌. ర‌ష్మిక‌, పూజా హెగ్డే, స‌మంత‌ లాంటి హీరోయిన్లు ఇది వ‌ర‌కే బ‌న్నీతో న‌టించారు. వాళ్లెవ‌రూ కాకుండా ఫ్రెష్ కాంబోల‌ను తీసుకురావాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. మ‌రి.. బ‌న్నీకి జోడీగా ఎవ‌రు సెట్ట‌వుతారో చూడాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close