జగన్ రెడ్డి ప్రచార పిచ్చి వల్ల రెండు ప్రాణాలు పోయాయి. రెంటపాళ్లలో ప్రభుత్వం ఏర్పడక ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పెద్ద షో చేశారు. గుంటూరు నుంచి రెంటపాళ్లకు వెళ్లే దారిలో జన సమీకరణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించి.. రెండు ప్రాణాలను బలి తీసుకున్నారు.
గుంటూరులో జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోగా.. సత్తెనపల్లిలో జగన్ ర్యాలీకి తీసుకు వచ్చిన ఓ వ్యక్తి.. సొమ్మసిల్లి .. చనిపోయాడు. దీంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే జగన్ రెడ్డి మాత్రం ఏ మరణాన్ని పట్టించుకోలేదు. తన దారిన తాను రెంటపాళ్లకు వెళ్లి రాజకీయం చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందే జరిగిన ఆత్మహత్యను.. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకొచ్చారు.
జగన్ రెడ్డి వ్యవహార శైలి సామాన్య ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. రాజకీయం కోసం.. ప్రాణాలు తీయడం.. తప్పుడు ప్రచారాలు చేయడమే కాదు..కనీసం తనను చూసేందుకు వచ్చిన వారు ఇద్దరు చనిపోతే పట్టింకుకోకుండా వెళ్లిపోవడం ఆయన తీరును ..నైజాన్ని వెల్లడిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.