“మహా”లో నేటి నుంచి “సర్కార్” రూల్..! కాని ఎంత కాలం..?

మహారాష్ట్ర రాజకీయాలను.. కనుసైగలతో.. శాసించిన బాల్ ధాకరే కుటుంబం .. తొలి సారి… ప్రత్యక్ష అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. కర్టూనిస్టు స్థాయి నుంచి కరుడుగట్టిన హిందూత్వ వాదిగా.. శివసేనను స్థాపించి మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ థాకరే ఓ శిఖరంగా నిలిచారు. దశాబ్దాలుగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ధాకరే కుటుంబం పోటీ చేయదు. ఎలాంటి పదవులు అయినా శివసైనికులే.. పొందుతూ ఉంటారు. అయితే బాల్ థాకరే.. చేపడితే.. ముఖ్యమంత్రి పదవి మాత్రమే చేపట్టాలన్న లక్ష్యంతో ఉండేవారు. ఇప్పుడా లక్ష్యాన్ని.. ఆయన కుమారుడు ఉద్దవ్ థాకరే తీరుస్తున్నారు. నేడు ఉద్దవ్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఓ రకంగా.. శివసేన రాజకీయాల్లో ఇది అత్యున్నత స్థితి.

మహా పీఠాన్ని .. సర్కార్ కుటుంబం అందుకునే దిశగా.. జరిగిన పరిణామాలు.. భవిష్యత్‌ను ఊహించలేకపోతున్నాయి. సిద్దాంతాల పునాదులను సైతం.. పెకిలించి.. ఇంత కాలం తాము ఎవరితో పోరాడామో.. వారితో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా కలిసి ఉన్న.. బీజేపీని తృణప్రాయంగా పక్కన పెట్టేశారు. బీజేపీకి ఇది తాత్కాలికంగా.. నష్టం చేకూర్చవచ్చు కానీ.. మహారాష్ట్రలో సొంతంగా ఎదగాలనుకుంటున్న ఆ పార్టీకి.. గొప్ప అవకాశాన్ని.. శివసేన ఇచ్చింది. ఇప్పుడు.. మహారాష్ట్రంలో హిందూత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్క బీజేపీనే నిలిచింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడం ద్వారా శివసేన ఇక బలమైన .. హిందూత్వవాదాన్ని వినిపించే అవకాశం కోల్పోయింది.

అదే సమయంలో.. ఈ ప్రభుత్వం ఎంత కాలం మనుగడలో ఉంటుందన్నది మరో కీలకమైన అంశం. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే వరకూ.. అంటే.. మహా అయితే.. ఏడాది, ఏడాదిన్నర మాత్రమే.. బీజేపీ సహనంగా ఉంటుంది. ఆ తర్వాత తన మార్క్ రాజకీయాలకు తెర తీస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అప్పటికి.. మూడు పార్టీల్లోని అసంతృప్తులను పోగేసి..మరోసారి “కర్ణాటక” ఫార్ములాను తెరపైకి తెస్తుందని అంటున్నారు. అదే జరిగితే.. మొత్తంగా నష్టపోయేది శివసేననే. తెలుగుదేశం పార్టీ ల్లాంటి వాటి అనుభవాలు చూసిన తర్వాత.. దీన్ని ఎవరూ కాదనలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్ వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close