జగన్ రెడ్డికి కష్టం వస్తే ఉండవల్లి తట్టుకోలేరు. అడ్డగోలు పనులు చేసి అడ్డంగా దొరికిపోయినా జగన్ను నిలువుగా సపోర్టు చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీనే. తాజాగా కల్తీ నెయ్యిపై విచిత్రమైన వాదనతో తెర ముందుకు వచ్చారు. లడ్డూలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉందని సిట్ తేల్చిందని ఆయన చంద్రబాబు ఎందుకు పదే పదే జంతు కొవ్వు ఉందని.. టాయిలెట్లు కడిగే కెమికల్ ఉందని చెబుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన అంబటి రాంబాబుతో ములాఖత్ అవడం కన్నా.. ఇలా కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు నిజాలు బయట పెట్టడాన్ని తప్పు పట్టడానికే ఆయన అటు వచ్చినట్లుగా ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి నొప్పి కలిగించే విషయాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు బయటపెట్టడమే తప్పన్నట్లుగా మాట్లాడారు. ఎన్డీడీబీ రిపోర్టులో ఉన్నదే చంద్రబాబు చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం లో కల్తీ విషయం బయటపెట్టకుండా ఉంటే.. అదే్ మహాపరాధం. ఇంకో సారి ఎవరైనా తప్పు చేయాలంటే వణికిపోయేలా చేయాలి. అది ఎవరైనా సరే.
అయినా ఉండవల్లి ఈ అంశంపై జగన్ ను వెనకేసుకు వచ్చే బదులు.. దేవుడి దగ్గర.. చివరికి దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం ఏమిటని ..తాను అభిమానించే వైఎస్ కుమార రత్నానికి గడ్డి పెట్టి ఉంటే.. బెటర్ గా ఉండేది. అంబటి రాంబాబును అరెస్టు చేయడం కూడా తప్పే అన్నట్లుగా ఉండవల్లి మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు వచ్చి చెడామడా జగన్ రెడ్డికి గట్టిగా బుద్ది చెప్పి ఉంటే ఆయనకు ఏమైనా తెలివి వచ్చేదేమో. ఆయన చేసినప్పుడు మనసులో సంతోషపడి.. పైపైన ఖండించి ఇప్పుడు వచ్చి గగ్గోలు పెట్టి ఏం ప్రయోజనం ఉంటుంది.
