మరో 4 రోజుల్లో ‘ఉస్తాద్’ హవా వెండి తెరపై చూడబోతున్నాం. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. మైత్రీ మూవీస్ నిర్మించింది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. రేపు ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు. 2 నిమిషాల 7 సెకన్ల పాటు సాగిన పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో ఇది. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, హరీష్ రాసిన వన్ లైనర్లు, శ్రీలీల క్యూట్ నెస్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మైత్రీ చూపించిన భారీదనం వెరసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిలపబోతున్నాయి. ఈ అంశాన్నీ ట్రైలర్ లో కనిపించాయి.
వాడు నీకు భయపడలేదా, అసలు ఎవడికీ భయపడలేదా – అంటూ ఫస్ట్ డైలాగ్ తోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు హరీష్.
‘వయెలెన్స్ అంటే మీనింగ్ తెలియకపోవడం మీ అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయింది.. చూపిస్తా.. అర్థం, భావం.. అవసరం.. అన్నీ చూపిస్తా’ అంటూ పవన్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది.
శ్రీలీలను పట్టుకొని ‘మాయమ్మె… మాయమ్మె’ అంటూ దిష్టి తీయడంలో పవన్ తాలుకూ చమత్కారం కనిపిస్తుంది.
‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్’.. అని పవన్ అనగానే
‘డాన్స్ తెలుగు పదం కాదు’ అని కౌంటర్ ఇవ్వడం బాగుంది. గోత్రం..నక్షత్రం అంటూ పవన్ చివర్లో చెప్పిన డైలాగ్ కొసమెరుపు.
ఇలా ట్రైలర్ నిండా డైలాగులు, యాక్షన్ మూమెంట్లతో నింపేశాడు. వపన్ ఫ్యాన్స్ కి కావాల్సిన సరంజామా మొత్తం ఈ ట్రైలర్ లో ఉంది. తమన్ ఇచ్చిన బీజీయం మరీ ఎక్స్ట్రార్డనరీగా లేదు కానీ, ఫర్వాలేదనిపిస్తోంది.


