యూవీ క్రియేషన్స్ లో ఇది వరకటి స్పీడు లేదు. సాహో కమర్షియల్ గా దెబ్బ కొట్టింది. ఆ తరవాత, అంతకు ముందు చేసిన కొన్ని ప్రాజెక్టులు వర్కవుట్ కాలేదు. దానికి తోడు విశ్వంభర వాయిదా పడడం కూడా ఇబ్బంది పెట్టే వ్యవహారమే. అందుకే కొత్త ప్రాజెక్టులు ఆ సంస్థ నుంచి రావడం లేదు. అఖిల్ తో యూవీ ఓ సినిమా చేయాల్సింది. కానీ.. అది పక్కకు వెళ్లిపోయింది. ‘కొరియన్ కనకరాజు’ సెట్స్ పై ఉంది. అది మినహాయిస్తే యూవీ నుంచి కొత్త సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వరకటిలా వస్తాయా, రావా? అని చాలామంది అనుమానించారు.
అయితే ఇప్పుడు ఓ క్రేజీ కాంబోపై యూవీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్, ధనుష్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. కథ ఇప్పటికే సిద్ధం. ఇద్దరు హీరోలూ కథ విని.. నటించడానికి ఓకే చెప్పేశారన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈలోగానే… ‘కొరియన్ కనరరాజు’ వచ్చేస్తుంది. ఆ తరవాత మోహన్ లాల్, ధనుష్‌ల మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ఇదే కాకుండా మరో రెండు చిన్న సినిమాలు మొదలెట్టే ఆలోచనలో ఉంది యూవీ. వాటికి సంబంధించిన వివరాలు మెల్లగా బయటకు రానున్నాయి. యూవీ లాంటి సంస్థలు సినిమాలకు గ్యాప్ ఇవ్వకూడదు. క్వాలిటీ మేకింగ్ కి నమ్ముకొన్న ఇలాంటి సంస్థలు తరచూ సినిమాలు తీస్తూనే ఉండాలి. మధ్యలో గ్యాప్ వస్తే ఇబ్బందే. ఇప్పుడు ఆ గ్యాప్‌ని ఫుల్ ఫిల్ చేసే ఉద్దేశంలో ఉంది యూవీ.