అవును హోదా కావాలని అడిగాను తప్పా? వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాటకారితనం గురించి అందికీ తెలిసిందే. ఈరోజు తెనాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో దానిని మరోసారి నిరూపించిచూపారు.

ప్రత్యేక హోదా అంశంపై ఈనాడు తనని నిందిస్తున్న తల్లి, పిల్లా కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా పొందేందుకు తగిన అర్హత లేకపోయినప్పటికీ ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చనే చట్టంలోని ఒక అంశం ఆధారంగా, విభజనలో హైదరాబాద్ కోల్పోతున్న ఏపికి ఆదాయ వనరులు లేవని, అందుకే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు తాను పార్లమెంటులో గట్టిగా వాదించానని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆనాడు అన్న మాటలకి నేటికీ కట్టుబడి ఉన్నానని చెపుతూనే, అందరికీ తెలిసిన కారణాలని చెప్పి అందువలననే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని ముక్తాయించారు. కానీ ఏపికి రెవెన్యూ లోటు భర్తీ అయ్యేవరకు కేంద్రం సహకరిస్తూ ఉండాలన్నదే తన కోరిక అని అన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీల జాబితాలని అన్నిటినీ చదివి వినిపించిన తరువాత అందులో లోపాల గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటి హామీల అమలుకు అవకాశాలు ఉన్నాయా లేవా అని అధ్యయనం చేస్తామని మాత్రమే విభజన చట్టంలో పేర్కొందని, కానీ తమ ప్రభుత్వం ఈ రెండునరేళ్ళలో వాటిలో అనేకం అమలు చేసి చూపించిందని వెంకయ్య నాయుడు చెప్పారు.

అదేవిధంగా ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు మొదలైన హామీలని అపాయింట్ మెంట్ డే (జూన్ 2, 2014) నుంచి పదేళ్ళలోగా ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొంటే, తమ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ళలోనే వాటిలో చాలా వరకు ప్రారంభించేశామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్నఈ లొసుగులని లేదా లోపాలని అడ్డం పెట్టుకొని తప్పించుకొనే అవకాశం తమ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ తాము కాంగ్రెస్ పార్టీలాగ రాష్ట్ర ప్రజలని మోసం చేయాలనుకోవడం లేదని అందుకే, దానిలో పేర్కొన్న హామీలని, పేర్కొనని వాటిని కూడా అమలు చేస్తున్నామని వెంకయ్య నాయుడు చెప్పారు. అయినా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలు చేస్తున్నాయని వింర్శించారు.

గాలికిఎగిరిపోయే తెలగపిండిని కృష్ణార్పణం అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ కూడా నోటికి వచ్చిన హామీలు గుప్పించేసి, ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ హామీలు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయమే అన్నట్లుగా మాట్లాడుతోందని విమర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, విభజన చట్టంలో హామీలని పరిశీలిస్తామని చెప్పాము తప్ప అమలు చేస్తామని హామీ ఇవ్వలేదు కదా అని తప్పించుకొని ఉండేదని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తెదేపా-భాజపాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటిపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వాటిని తెదేపా నేతలు కొంతవరకు ఎదుర్కొంటున్నారు కనీ రాష్ట్ర భాజపా నేతలు మాత్రం ఎందుకో ధీటుగా ఎదుర్కోవడం లేదు. కనుక వెంకయ్య నాయుడు రాష్ట్రంలో మరింత విస్తృతంగా పర్యటించి ప్రతిపక్షాలని ఎదుర్కొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close