‘క‌ర్ణ‌న్‌’ వ‌దులుకున్న వెంకీ

వెంక‌టేష్ కి రీమేక్ సినిమాలంటే మ‌క్కువ ఎక్కువ‌. త‌న కెరీర్‌లో స‌గం.. రీమేకులే. మినిమం గ్యారెంటీ ఉంటుంద‌న్న‌… న‌మ్మ‌కంతో రీమేకుల్ని ఎంచుకుంటాడు వెంకీ. ఇప్పుడు చేస్తున్న `నారప్ప‌`, `దృశ్య‌మ్ 2` రెండూ ప‌రాయి క‌థ‌లే. ఈమధ్య మ‌రో త‌మిళ క‌థ‌పైనా వెంకీ దృష్టి ప‌డింద‌ని టాక్‌. త‌మిళంలో ధ‌నుష్ చేసిన సినిమా `క‌ర్ణ‌న్‌`. ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమాని విడుద‌ల‌కు ముందే వెంకీ కోసం సురేష్ బాబు చూసేశాడ‌ట‌. అది ఆయ‌న‌కు న‌చ్చింది. వెంకీకీ చూపిస్తే… `ఇది తెలుగులో వ‌ర్క‌వుట్ అవ్వ‌దేమో` అనుకుని వ‌దిలేశాడ‌ట‌. అప్పుడే.. ఈ సినిమా బెల్లంకొండ శ్రీ‌నివాస్ చూడ‌డం, రీమేక్ రైట్స్ తీసేసుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఒక‌వేళ‌.. వెంకీకి ఈ సినిమా న‌చ్చితే.. త‌న ఖాతాలో మ‌రో రీమేక్ ప‌డిపోయేది. వెంకీ వ‌దులుకున్న క‌ర్ణ‌న్‌…. సాయికి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఈసినిమాకి.. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. `నారప్ప‌` చూశాక‌… ఆ సినిమా బాగుంటే, శ్రీ‌కాంత్ అడ్డాల‌కే ఆ ఛాన్స్ ఇవ్వాల‌ని బెల్లంకొండ భావిస్తున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో ఏమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్న మంత్రులు, ప్రభుత్వం !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close