‘వ‌కీల్ సాబ్‌’ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ట‌యిన ‘పింక్‌’ని తెలుగులో ‘వ‌కీల్ సాబ్‌’గా రీమేక్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. `వ‌కీల్‌సాబ్` ఫ‌స్ట్ లుక్‌పై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫ్యాన్స్‌కి ఈ లుక్ న‌చ్చినా – కొంత‌మంది మాత్రం `ఇది మ‌హిళ‌ల క‌థ క‌దా.. వాళ్లెవ‌రూ లేకుండా పోస్ట‌ర్‌ని వ‌దిలారేంటి` అని ప్ర‌శ్నించారు. వీటిపై ఇప్పుడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ స‌మాధానం ఇచ్చారు. “ప‌వ‌న్ అభిమానుల కోసం ఫ‌స్ట్ లుక్‌ని ఆ విధంగా డిజైన్ చేశాం. అయితే నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు… `ఇది అమ్మాయిల క‌థ క‌దా. వాళ్ల‌నిచూపించ‌రా` అని అడిగారు. `మ‌గువ‌` పాట‌లో మేం కేవ‌లం అమ్మాయిల గురించే చెప్పాం. ఆ పాట‌లో… క‌నీసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో కూడా చూపించ‌లేదు. అమ్మాయిల్ని గౌర‌వించే సినిమా ఇది. `పింక్‌`లో వాళ్ల కోసం పాటేదీ లేదు. త‌మిళంలో వ‌చ్చిన అజిత్ సినిమాలోనూ అంతే. ఆ రెండు చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయిల గొప్ప‌ద‌నం విశ్లేషిస్తూ ఓ పాట ని రూపొందించాం. ఇదే కాదు.. ఈ సినిమాలో అమ్మాయిల కోసం మ‌రో పాట కూడా ఉంది“ అన్నారు. ఈ చిత్రంలో మొత్తం 5 పాట‌లుంటాయ‌న్నారు. కాక‌పోతే.. డాన్సింగ్ నెంబ‌ర్లేమీ ఉండ‌వ‌న్న క్లారిటీ ఇచ్చారు. “ప‌వ‌న్ నుంచి ఈ సినిమాలో డాన్సులు ఆశించ‌లేం. ఆయ‌న కాస్త స్టైలీష్ గా న‌డుచుకుంటూ వ‌చ్చినా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు. ఆయ‌న ఒక‌టి కాదు… చాలా గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు“ అని ప‌వ‌న్ ఫ్యాన్స్ కి న‌చ్చే ఓ అప్ డేట్ ఇచ్చారు వేణు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close