శీన‌య్య‌.. మొద‌లెట్ట‌వ‌య్యా..?

ద‌ర్శ‌కుడు వినాయ‌క్ హీరోగా మారాల‌నుకున్న సినిమా `శీన‌య్య‌`. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డం, వినాయ‌క్ హీరోగా ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఈ సినిమాపై క్రేజ్ పెంచాయి. అయితే ఈ సినిమా ఆగిపోయింద‌ని, క‌థ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల – ప‌క్క‌న పెట్టేశార‌ని వార్త‌లొచ్చాయి. వినాయ‌క్ కూడా ఈ క‌థ‌పై అసంతృప్తితో ఉన్నాడ‌ని, అందుకే ఈ సినిమా వ‌దులుకుని, ద‌ర్శ‌క‌త్వంవైపు దృష్టి పెట్ట‌బోతున్నాడ‌ని చెప్పుకున్నారు.

అయితే… అలాంటిదేం లేదు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతోంది. ఈనెల 28 నుంచి హైద‌రాబాద్‌లో శీన‌య్య కొత్త షెడ్యూల్ మొద‌లు కాబోతోంది. క‌థ‌పై కాస్త అసంతృప్తి , కొన్ని అనుమానాలు రేగిన మాట వాస్త‌వ‌మే. అయితే దిల్ రాజు త‌న డైరెక్ష‌న్ టీమ్‌ని కూర్చోబెట్టి లోపాల్ని స‌రిదిద్దుకుంటూ వెళ్లాడ‌ట‌. ఇప్పుడు స్క్రిప్టు బాగా వ‌చ్చింద‌ని, ఆ న‌మ్మ‌కంతోనే సినిమాని మొద‌లెడుతున్నార‌ని తెలుస్తోంది. పైగా వినాయ‌క్ హీరోగా అంగ‌రంగ వైభ‌వంగా ఆరంభ‌మైన సినిమా ఇది. మ‌ధ్య‌లో ఆగిపోతే… అది వినాయ‌క్ ఇమేజ్‌కే డామేజ్‌. అందుకే… ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ సినిమాని పూర్తి చేయాల‌ని వినాయ‌క్ భావించాడ‌ట‌. అందుకే.. ఈ సినిమా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close