ర‌ష్మిక‌.. పూజా… నువ్వా? నేనా?

ఎన్టీఆర్ 30వ సినిమాకి ఓ అంద‌మైన స‌మ‌స్య ఎదురైంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేయాలి? అనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇటీవ‌లే వ‌చ్చేసింది. ఇది ఎన్టీఆర్ హీరోగా న‌టించే 30వ సినిమా. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత ప‌ట్టాలెక్కే సినిమా ఇదే. క‌థానాయిక ఎవ‌ర‌నే విష‌యంలో చాలా రోజుల నుంచీ కస‌ర‌త్తు జ‌రుగుతూనే ఉంది. తొలుత ర‌ష్మిక పేరు బాగా వినిపించింది. ర‌ష్మిక సైతం ఓ సంద‌ర్భంలో, త్రివిక్ర‌మ్ స‌మ‌క్షంలో.. `మీ సినిమాలో చేయాల‌నివుంది` అంటూ మ‌న‌సులోకి కోరిక బ‌య‌ట‌పెట్టింది. ఓ ద‌శ‌లో.. త్రివిక్ర‌మ్ సినిమాలో ర‌ష్మిక ఎంపిక ఖాయం అనేసుకున్నారు.

అయితే స‌డ‌న్‌గా పూజా హెగ్డే రేసులోకి వ‌చ్చేసింది. ఎన్టీఆర్ – పూజాలది హిట్ కాంబినేష‌న్‌. అర‌వింద స‌మేత‌లో ఇద్ద‌రూ జంటగా క‌నిపించారు. త్రివిక్ర‌మ్‌కి కూడా పూజా బాగా క‌లిసొచ్చింది. అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల్లో త‌నే నాయిక‌. సో.. ఆ సెంటిమెంట్‌కి ముచ్చ‌ట‌గా మూడోసారి కొన‌సాగించాల‌నుకుంటున్నాడు త్రివిక్ర‌మ్‌. అయితే `భీష్మ‌` హిట్టుతో మ‌రోసారి ర‌ష్మిక పేరు మార్మోగిపోతోంది. భీష్మ నిర్మాత రాధాకృష్ణ త్రివిక్ర‌మ్‌కి బాగా క్లోజ్‌. హారిక హాసిని అంటే త్రివిక్ర‌మ్ సినిమా కిందే లెక్క‌. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబో కూడా హారిక హాసిని క్రియేష‌న్స్‌పైనే తెర‌కెక్కుతోంది. వాళ్లైతే… ర‌ష్మిక‌ని మ‌రోసారి రిపీట్ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే.. హారిక‌లో ఏం చేసినా.. తుది నిర్ణ‌యం మాత్రం త్రివిక్ర‌మ్‌దే. ఆయ‌న ఓటు ఎవ‌రికి వేస్తాడు? అనేదే ముఖ్యం. త‌న‌కు అచ్చొచ్చిన హీరోయిన్‌ని మ‌ళ్లీ తీసుకుంటాడా, లేదంటే ఎన్టీఆర్ ప‌క్క‌న ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని ర‌ష్మిక ని రంగంలోకి దింపుతాడా? అనేదే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close