విరాట‌ప‌ర్వం ఈవెంట్‌లో అప‌శృతి

విరాట‌ప‌ర్వం ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో అప‌శృతి చోటు చేసుకొంది. ఈదురు గాల‌ల‌కు స‌భా ప్రాంగ‌ణంలోని ఎల్ ఈ డీ స్క్రీన్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. దాంతో… ప్రేక్ష‌కులు, చిత్ర‌బృందం భ‌యభ్రాంతుల‌కు లోనైంది. ఆ స‌మ‌యానికి స్టేజీపై ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ క‌ర్నూలులో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టారు. పోగ్రాం ప్రారంభ‌మైన కాసేప‌టికే వాతావ‌ర‌ణం అనూహ్యంగా మారిపోయింది. ఇండోర్ స్టేడియం కావ‌డంతో.. ఈదురు గాలుల తాకిడికి ఎల్ ఈ డీ స్క్కీన్ కింద‌కు ప‌డిపోయింది. అదృష్ట‌వ‌శాత్తూ స్టేజీ వెనుక ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. అంద‌రూ ఊపిరి పీల్చుకొన్నారు. స్టేడియంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో ఆ గంద‌ర‌గోళం మ‌రింత పెరిగింది. స్క్రీన్ కూలిపోయిన‌ వెంట‌నే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్రేక్ష‌కులు అరుపులూ, కేక‌ల‌తో స్టేడియం బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. చిత్ర బృందం కూడా హుటాహుటీన సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు వెళ్లిపోయారు. ఈ పోగ్రాం జ‌రుగుతుందా, లేదా? అనేది అనుమానంగా మారిందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో 950కోట్ల స్కామ్…మంత్రిపై సంచలన ఆరోపణలు..!!

తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి తాజాగా మరో బిగ్ బాంబ్ పేల్చారు. ఆర్ ట్యాక్స్ కు జతగా మరో ట్యాక్స్...

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close