దాస్‌ని ముంచిన ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌

విశ్వ‌క్‌సేన్ నుంచి వ‌చ్చిన మ‌రో సినిమా `దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ తానే వ్య‌వ‌హ‌రించాడు విశ్వ‌క్‌. విడుద‌ల‌కు ముందు ఈ సినిమాకి మంచి బేరం వ‌చ్చింది. అవుట్ రేట్ రూ.20 కోట్ల‌కు తీసుకోవ‌డానికి ఓ బ‌య్య‌ర్ ముందుకొచ్చాడు. కానీ త‌న సినిమాపై విశ్వ‌క్‌కి ఉన్న అతి న‌మ్మ‌కం వ‌ల్ల‌.. ఈ డీల్ కి ఒప్పుకోలేదు. డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల్నీ అమ్ముకోలేదు. రూ.12 కోట్ల‌కు నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్‌ని అమ్మ‌దామ‌ని చూశాడు. కానీ ఓ ఓటీటీ సంస్థ రూ.8 కోట్లు ఇవ్వ‌డానికి ముందుకొచ్చింది. కానీ విశ్వ‌క్ మ‌న‌సొప్ప‌లేదు. తీరా సినిమా విడుద‌లై.. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాపై రివ్యూల‌న్నీ నెగిటీవ్‌గానే వ‌చ్చాయి. కానీ విశ్వ‌క్ చేసుకొన్న ప‌బ్లిసిటీ, మాస్ లో త‌న‌కున్న‌క్రేజ్ వ‌ల్ల ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. టాక్ కీ, వ‌సూళ్ల‌కీ సంబంధమే లేదు.కాక‌పోతే.. పెట్టుబ‌డి మాత్రం తిరిగి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రూ.20 కోట్ల బేరం వ‌చ్చిన‌ప్పుడు అవుట్ రేట్ కి అమ్మేసినా, నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూ.8 కోట్ల‌కు ఇచ్చేసినా.. విశ్వ‌క్ ఈపాటికి గ‌ట్టెక్కేసేవాడు. కానీ.. అలా జ‌గ‌ర‌లేదు. ఇప్పుడు నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ నుంచి రావాల్సిన డ‌బ్బులు ఆగిపోయాయి. రూ.6 కోట్ల‌కు ఇచ్చేద్దామ‌న్న కొన‌డానికి ఓటీటీ ముందుకు రావ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

గుడివాడ టిడ్కో ఇళ్లు -పరువు పోగొట్టుకున్న కొడాలి నాని !

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close