బెంగాల్ లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీకి మారిపోతున్న రాజకీయ పరిస్థితులు కలసి వస్తున్నాయి. కొత్త శక్తులు పుట్టుకు వస్తూండటంతో అధికార పార్టీ ఓట్ బ్యాంక్ చీలిక ఖాయంగా కనిపిస్తోంది. ఆ చీలిక బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ బలపడిన తర్వాత త్రిముఖం పోటీలు జరుగుతున్నాయి. లెప్ట్ క్రమంగా బలహీనపడినా.. కాంగ్రెస్ తో గెలిచి గణనీయమైన ఓట్లను చీలుస్తోంది. ఈ సారి కూడా అదే జరగనుంది. కొత్తగా ముస్లిం వర్గాల్లో పట్టు పెంచుకుంటున్న పార్టీ ఒకటి జోరు మీద ఉంది.
ముస్లిం ఓట్లలో చీలిక తేనున్న కబీర్ పార్టీ
బెంగాల్ లో 30 శాతం వరకూ ఉన్న ముస్లిం వర్గాల్లో క్రమంగా పట్టు పెంచుకుంటున్న పార్టీ జేఎన్పీ. హుమాయున్ కబీర్ అనే నేత స్థాపించిన జనతా ఉన్నయన్ పార్టీ క్రమంగా ముస్లింలలో పట్టు పెంచుకుంటోంది. ఈ 180 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీనికి తోడు కాంగ్రెస్-వామపక్ష కూటమి కూడా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో, ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ( ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. ముస్లింలు ఇప్పటి వరకూ ఏకపక్షగా తృణమూల్‌కే మద్దతిస్తున్నారు.
ముస్లిం ఆధిక్యత ఉన్న నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలు
బెంగాల్ జనాభాలో సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు దాదాపు 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలపై కొత్త పార్టీలు దృష్టి సారించాయి. వీటిలో ప్రస్తుతం అత్యధికంగా తృణమూల్ కే లభిస్తున్నాయి. కొత్తగా వచ్చిన పార్టీ హుమాయున్ కబీర్ నేతృత్వంలోని JNP, అబ్బాస్ సిద్ధిఖీకి చెందిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ , అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం కూడా ఈ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాయి. పైగా పొత్తులు పెట్టుకుని పోటీకి సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ కు ఓట్ల కన్నా సీట్లు ఎక్కువగా కోత పడుతాయి.
దీదీని ఓడించేలా ఓవైసీపీ ప్లాన్లు
అసదుద్దీన్ ఒవైసీకి మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ , దక్షిణ దినాజ్‌పూర్ వంటి సరిహద్దు జిల్లాల్లో పట్టు ఉంది. ఈ ప్రాంతాల్లో మజ్లిస్ , ISF వంటి పార్టీలు బలంగా పుంజుకుంటే, సంప్రదాయబద్ధంగా మమతా బెనర్జీకి అండగా ఉండే ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మంచి ఫలితాలు సాధించింది. ఓట్లు ఇలా బహుముఖంగా చీలిపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ లాభపడటం ఖాయం అనుకోవచ్చు. సుమారు 32-34 శాతం స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ, ప్రతిపక్ష ఓట్లు ( ఇతర పార్టీల మధ్య చీలిపోతే తక్కువ మెజారిటీతోనైనా విజయం సాధించవచ్చని భావిస్తోంది. అందుకే ఓట్ల చీలిక పార్టీలకు పరోక్షంగా సాయం చేయడానికి రెడీగా ఉంది.
