ఈ నిర్మాత‌ల‌కు అస‌లు గుండె ఉందా??

తెలుగు సినిమా బ‌డ్జెట్ 100 కోట్లంటే ఆశ్చ‌ర్య‌పోయాం. ఇప్పుడు దానికి డ‌బుల్ ట్రిపుల్ అయిపోయింది. సాహోతో బ‌డ్జెట్ ప‌రిధుల‌న్నీ ప‌టాపంచ‌లైపోయాయి. యూవీ క్రియేష‌న్స్ ధైర్యాన్ని చూసి.. తెలుగు సినిమా మ‌హామ‌హులంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ నిర్మాత‌ల‌కు భ‌యం అనేది ఉందా? వీళ్లది మ‌నిషి గుండేనా?? అంటూ అవాక్క‌వుతున్నారు. సాహో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో రాజ‌మౌళి, వినాయ‌క్‌, శ్యాంప్ర‌సాద్ రెడ్డి, దిల్‌రాజు, అల్లు అర‌వింద్‌.. వీళ్లంది మాట అదే.

”ఈ నిర్మాత‌ల‌కు భ‌యం అనే చిప్ ఇవ్వ‌లేద‌నుకుంటా. అస్స‌లు ఏమాత్రం భ‌యప‌డ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ తీయ‌లేదు, ఇక ముందు తీయ‌బోరేమో అనే స్థాయిలో ఈ సినిమా తీశారు”
– అల్లు అర‌వింద్‌

”ఏ నిర్మాత అయినా బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ డేట్లు ఇస్తానంటే డ‌బ్బులు చేసుకోవాల‌ని చూస్తారు. కానీ బాహుబ‌లి 2 కి మించిన బ‌డ్జెట్‌తో సాహో తీశారు. నా మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ కంటే `మిర్చి`కి డ‌బ్బులు ఎక్కువ పెడుతున్న‌ప్పుడు `ఇంత బ‌డ్జెట్ పెడుతున్నారేంటి` అని అడిగాను. `మ‌న ప్ర‌భాస్ సినిమా క‌దా, పెట్టేస్తున్నాం` అన్నారు. సాహోకీ ఇలానే అడిగాను. అప్పుడూ అదే మాట చెప్పారు. మిమ్మ‌ల్ని చూసి నిర్మాత‌లం అయ్యామ‌ని వాళ్లు చెబుతుంటారు. వాళ్ల‌ని చూసి పాన్ ఇండియా సినిమా ఎలా తీయాలో నేను నేర్చుకుంటున్నా”
– దిల్ రాజు

”ఈ నిర్మాత‌ల‌కు మ‌నుషుల‌కు ఉండే గుండె కాకుండా, సింహాల‌కూ, పులుల‌కు ఉండే గుండెనిచ్చాడేమో దేవుడు. ఈ సినిమా బ‌డ్జెట్ చూసి అంతా భ‌య‌ప‌డుతున్నారు. వాళ్లు మాత్రం భ‌య‌ప‌డ‌డం లేదు. వాళ్ల ధైర్యం ప్ర‌భాస్‌”
– వి.వి.వినాయ‌క్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com