జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఎమోషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో ఈ సినిమా గురించి, హృతిక్ రోషన్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిలింస్ టీం గురించి తన మనసులోని మాటలను ప్రస్థావించారు.
“వార్ 2 షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా గొప్ప జర్నీ. హృతిక్ సర్‌తో సెట్లో ఉండడం ఎప్పుడూ ఓ సరదాగా వుంటుంది. ఆయన ఎనర్జీ అంటే నాకు ఇష్టం. ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు అయాన్ అద్భుతంగా పనిచేశాడు. ఆయన రూపొందించిన కథనం ప్రేక్షకుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ లా ఉంటుంది. మా మొత్తం యష్ రాజ్ ఫిలిమ్స్ టీమ్ అందరికీ థాంక్ యూ. మీ అందరి ప్రేమ కు కృతజ్ఞతలు. ఆగస్టు 14న మీ అందరికి ఈ సినిమా ఇచ్చే హై ఎక్స్ పీరియన్స్ కోసం ఎదురుచూస్తున్నాను!”అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన అభిమానులు, సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను అభినందిస్తున్నారు. హృతిక్ – ఎన్టీఆర్ ని స్క్రీన్ పై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్ 2 యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన సినిమా. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.