అమెరికా నుంచి అదానీపై మరో రాయి పడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి చెందిన డబ్బును అదానీ గ్రూప్్లోకి పెద్ద ఎత్తున అక్రమంగా పంపింగ్ చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. అక్టోబర్ 24న ప్రచురితమైన వార్తా కథనంలో.. అమెరికాలో గతంలో అదానీపై కేసు నమోదు అయిన విషయం వెలుగు చూసిన తర్వాత.. అదానీ గ్రూప్ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో ఆయనకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు.
ఇలాంటి మయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సుమారు 32,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు అదానీ గ్రూపులోకి పంపించారు. అదాని గ్రూప్ 90 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌ను కాపాడటానికి , ఎక్కడా లభ్యం కాని రుణాన్ని ఇప్పించడానికి కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు చేసిన ప్రయత్నాల కారణంగానే ఈ పెట్టుబడులు పెట్టారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించారు. LIC మొత్తం 3.4 బిలియన్ డాలర్ల బాండ్ పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని అదానీ గ్రూప్‌లోని రెండు సబ్సిడరీలకే మళ్లించారు. ఈ ప్రక్రియను సీనియర్ ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది.
అయితే ఎల్ఐసీ ఈ ఆరోపణలను ఖండించింది. తమ బాండ్ పెట్టుబడుల్లో ఎవరి జోక్యం లేదని.. తమ పాలసీలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపింది. అదానీ గ్రూప్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. అదానీ గ్రూపులో అత్యధిక పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంటుంది.