పుణె స్టోరీ సైడ్ A : ధనవంతుల డ్రైవర్లే బలిపశువులు

ఓ ధనవంతుడి బిడ్డ తప్పతాగి డ్రైవింగ్ చేసి ఓ చిన్నారి ప్రాణం తీస్తాడు. పోలీస్ కేసవుతుంది. తన బిడ్డ ఎక్కడ జైలుకుపోతాడోనని ఆ రిచ్ కిడ్ తల్లిదండ్రులు .. డ్రైవింగ్ చేసింది తానేనని డ్రైవర్ తో అంగీకరింపచేస్తారు. అందుకు డబ్బులు ఆఫర్ ఇస్తారు. అంత మొత్తం తన జీవితంలో చూడలేనని కొద్ది రోజులు జైలుకుపోతే సరిపోతుందనుకున్న డ్రైవర్ అంగీకరిస్తారు. చివరికి ఏమవుతుందనేది తర్వాత విషయం… ఇది ఇటీవల వచ్చిన సప్తసాగరాలు దాటి సైడ్ A సినిమాలో పాయింట్. పుణే లో మైనర్ చేసిన యాక్సిడెంట్ కేసులో కాస్త ఆలస్యంగా ఇదే రిపీట్ చేశారు ధనవంతులైన ఆ తల్లిదండ్రులు.

పుణె యాక్సిడెంట్ కేసులోకి డ్రైవర్ని తెచ్చిన రిచ్ డాడ్

పుణెలో పోర్ష్ కారుతో బీభత్సం సృష్టించిన మైనర్ వ్యవహరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పదిహేడేళ్లు కూడా నిండని వాడికి పోర్షే కారు ఇచ్చిన రిచ్ డాడ్ .. యాక్సిడెంట్ అయిన తర్వాత తన డబ్బు పలుకుబడిని విస్తృతంగా ఉపయోగించారు. దేశవ్యాప్తంగా కేసు సంచలనం అయిన తర్వాత కూడా ఆ రిచ్ డాడ్ తన డ్రైవర్ ను సీన్ లోకి తెచ్చారు. కొన్నాళ్లు జైలుకెళ్తే ఎంత డబ్బు ఇస్తానని ఆశ పెట్టారో కానీ.. ఆ పోర్ష్ కారును తానే డ్రైవ్ చేశానంటూ వారి డ్రైవర్ పోలీసుల ముందు చెప్పారు. ఈ వ్యవహారం అందరి నోరు వెళ్లబెట్టేలా చేసింది.

వీడియో సాక్ష్యాలు ఉండటంతో సిగ్గుపడిన పోలీసులు

మాములుగా అయితే ఈ కేసును పోలీసులు కూడా అలాగే మలుపు తిప్పి ఉండేవారు. ఎందుకంటే డబ్బుకు ఉన్న పవర్ అలాంటిది. కానీ పుణె ఇష్యూలో మొత్తం వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. యాక్సిడెంట్ చేసిన తర్వాత అందులో డ్రైవింగ్ చేస్తున్న మైనర్ ను స్థానికులు బయటకు లాగి కొట్టిన దృశ్యాలు ఉన్నాయి. అప్పుడా కారులో ఎవరూ లేరు. డ్రైవర్ నేరాంగీకారం వ్యవహారం వెలుగు చూసిన తర్వాత మన చట్టం ఇంత గుడ్డిదా అని ఆశ్చర్యపోయేవారు పెరిగిపోయారు.

ధనవంతుల పిల్లల జీవితాలే విలువైనవా ?

అయితే పోలీసులు దీనిపై దేశవ్యాప్త చర్చ జరుగుతూండటంతో సిగ్గుపడినట్లుగా ఉన్నారు. డ్రైవర్ డ్రైవింగ్ చేయలేదని మైనరే చేశాడని చెబుతున్నారు. పోర్షే కారును మైనరే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నట్లుగా సీసీ టీవీ ఫుటేజీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇలా చెప్పవచ్చు కానీ.. అంతా సద్దుమణిగిపోయి.. మీడియా, సోషల్ మీడియా వేరే టాపిక్‌లోకి వెళ్లిపోయిన తర్వాత కేసు ఎలాంటి మలుపు తిరిగినా ఆశ్చర్యం లేదు. అందుకే ప్రముఖులు యాక్సిడెంట్లు చేస్తే.. వాళ్ల డ్రైవర్ల జీవితాలకు డబ్బులతో విలువ కట్టేస్తారు. అదే పేదల జీవితంలోని అసలైన సైడ్ .. డబ్బు చేసిన వారి జీవితాల్లో రియల్ సైడ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close