బండి సంజయ్‌కు సెక్యూరిటీ ఇచ్చిందెవరు ? తీసేసిందెవరు ?

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మూడు రోజుల కిందట సెక్యూరిటీ పెంచారు. కరీంనగర్‌లో ముస్లింలు, మసీదుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయనకు ముప్పు పెరిగిందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఆయనకు వన్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీతో పాటు రోప్ పార్టీని కూడా ఆరెంజ్ చేశారు. కానీ ఒక్క రోజులోనే మళ్లీ సీన్ మారిపోయింది. ఆయనకు సెక్యూరిటీ అవసరం లేదని వారందర్నీ వెనక్కి పంపేశారు. బండి సంజయ్‌కు ఇలా భారీ సెక్యూరిటీ ఇవ్వడంపై టీఆర్ఎస్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని అందుకే పోలీసులు వెనక్కి తగ్గారని అంటున్నారు.

నిజానికి ఇలాంటి రాజకీయ నేతలకు సెక్యూరిటీ పరంగా నిర్ణయం తీసుకోవలంటే.. ప్రభుత్వ పరంగా ఆదేశాలు కూడా రావాలి. అలాంటి ఆదేశాలు రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న వాదన ఉంది. కానీ బండి సంజయ్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు రెడీ చేసిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులే సెక్యూరిటీని ఏర్పాటు చేశారని తెరుస్తోంది. అయితే ఇప్పటికే… బండి సంజయ్… భారీ ఎత్తున ప్రభుత్వ పెద్దలపై వల్గర్ లాంగ్వేజ్‌తో విరుచుకుపడుతున్నారని.. ఇప్పుడీ సెక్యూరిటీతో ఆయన మరింతగా చెలరేగిపోతారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఊహించారు.

అందుకే .. బండి సంజయ్ సెక్యూరిటీ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం చేస్తోంది. అసలు ప్రభుత్వానికి తెలియకుండా సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేశారని.. ఇప్పుడు ప్రభుత్వం ఆగ్రహించిందని ఎలా వెనక్కి పంపారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి పోలీసు శాఖ, ప్రభుత్వ పెద్దలకు మధ్య సమన్వయలోపం వల్లే ఇలా జరిగిందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడానికి ఉపయోగపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close