తెలుగు రాష్ట్రాల మైనారిటీలు – ఈ ఎన్నికల్లో ఎటు వైపు?

భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల ఫీవర్లో మునిగిపోయింది. అందులోనూ పార్లమెంటుతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల టాపిక్ చర్చించ బడుతోంది. సామాన్యుల నుండి రాజకీయ నాయకులు దాకా అందరూ వారివారి విశ్లేషణల్లో మునిగిపోయారు. ఈ విశ్లేషణలో భాగంగా చర్చకు వచ్చిన ఒక అంశం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల లోని మైనారిటీలు ఈసారి ఎన్నికల్లో ఎటు వైపు మొగ్గు చూపుతారు అన్నది.

రిజర్వేషన్ల తో ముస్లింల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకున్న వైఎస్ఆర్:

ముందుగా ఆంధ్ర ప్రదేశ్ సంగతి తీసుకుందాం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం లు వైయస్ రాజశేఖర రెడ్డి తమ కోసం అప్పట్లో రిజర్వేషన్లు అమలు చేసిన కారణంగా వైఎస్ కుటుంబానికి కొంత అనుకూలంగా ఉంటారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ముస్లిం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ కూడా తన వంతుగా వైయస్ ప్రయత్నం చేశాడు అన్న భావన ముస్లింలలో ఉంది. అందువల్ల ముస్లింలు వైఎస్ఆర్సిపి పెట్టిన తర్వాత జగన్కు మద్దతు తెలుపుతూ వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు నిజానికి తెలుగుదేశం పార్టీ కంటే ముందే వైఎస్సార్ సీపీకి బిజెపి నుండి ఆహ్వానం అందినప్పటికీ ఈ ముస్లిం ఓట్లు పోతాయన్న భయం తోనే వైయస్ జగన్ ఎన్డియే లో చేరకుండా ఉండిపోయారు. అయితే వైయస్ రాజశేఖర్రెడ్డి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిన నాటి నుండి 2014 ఎన్నికల్లో కూడా జగన్తో పాటు ఉన్న ముస్లింలలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది.

జగన్ కొంపముంచుతున్న మోడీతో అప్రకటిత పొత్తు:

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు, అలాగే రాయలసీమ నాలుగు జిల్లాలలోని ముస్లిం లో ఎక్కువ శాతం జగన్ తో పాటు ఉన్నప్పటికీ, అర్బన్ ప్రాంతాలలోని ముస్లింల లోనూ, విద్యాధికులైన ముస్లింలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైయస్ జగన్ మోడీతో అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడని, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఫెడరల్ ఫ్రంట్ పేరు చెప్పి మోడీ కేసిఆర్ ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో చేరడానికి సర్పం సిద్ధమైందని, ఎన్నికల ముందే ఆ కూటమి లో చేరితే ముస్లిం ఓట్లకు గండి పడుతుంది అన్న ఒకే ఒక్క కారణంతో ప్రస్తుతానికి నేరుగా పొత్తు పెట్టుకో లేదని చాలామంది విద్యాధికులైన ముస్లింలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా, గత నెల రోజులుగా జరుగుతున్న ముస్లిం వేదికల మీద నేరుగానే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

కొంతమంది ముస్లిం పెద్దలు ఎప్పటినుండో బీజేపీని ఫాసిస్ట్ పార్టీ గా అభివర్ణిస్తూ ఉన్నారు. గత ఐదేళ్లలో పలుచోట్ల జరిగిన “అసహనం” సంఘటనలను, కొంతమంది బిజెపి నాయకులు హద్దుమీరి చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తూ, ఎన్నికలయ్యాక బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్న వైఎస్ఆర్ సీపీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఓటు వేసే విషయంలో పునరాలోచించుకోవాలని వారు మిగతా ముస్లింలను కోరుకుంటున్నారు. గత నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ కి పెద్దగా మద్దతు పలకని ముస్లింలు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, చంద్రబాబుకు మద్దతు పలకడమే మేలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు గత నాలుగేళ్లలో బిజెపితో పొత్తు ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో బిజెపి ని బలపడకుండా చేయడం, ప్రస్తుతం యూపీఏ నేతలతో చర్చ లు కొనసాగిస్తూ, బిజెపి వద్దకు కు తిరిగి వెళ్లే అన్ని అవకాశాలను వదులుకోవడం కారణంగా అర్బన్ ముస్లింలలో, విద్యాధికులైన ముస్లింలలో తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు కనిపిస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినా, తన మీద ఉన్న కేసుల కారణంగా కేంద్రంలోని మోడీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా అర్బన్ ముస్లింలు విద్యాధికులైన ముస్లింలు వైఎస్ఆర్సీపీకి దూరంగా జరుగుతున్నారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లింలలో ప్రస్తుతానికి కూడా వైఎస్ఆర్సిపి పట్ల మొగ్గు కనిపిస్తోంది. అదే సమయంలో ముస్లిం యువత లో, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తానంటున్న జనసేన పట్ల ఆసక్తి కనిపిస్తోంది.

తెలంగాణ అర్బన్ ముస్లింలలో కూడా ఇదే మార్పు:

ఇక తెలంగాణ విషయానికి వస్తే, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం కారణంగా కెసిఆర్ కు మద్దతు పలికిన ముస్లింలలో కూడా పార్లమెంటు ఎన్నికల అనేసరికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కెసిఆర్ ఏర్పాటుచేసిన ఫెడరల్ ఫ్రంట్ ఖచ్చితంగా మోడీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం దీనికి కారణం. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కావడం వల్ల టిఆర్ఎస్ కేంద్రంలోని కాంగ్రెస్ కూటమి లో చేరే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలు 1990లలో మాదిరిగా ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ అనివార్యంగా మోడీతో జుట్టు కట్టాల్సిన పరిస్థితులు ఎన్నికలయ్యాక ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా గ్రామీణ ముస్లింల లో ఈ విశ్లేషణ పెద్దగా లేకపోవడం వల్ల టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నా, అర్బన్ ముస్లింలలో విద్యాధికులైన ముస్లింలలో మాత్రం టీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు ఈ కారణంగానే మొగ్గు కనిపిస్తోంది.

మొత్తం మీద:

ముస్లిం లో జరుగుతున్న ఈ విశ్లేషణ క్రైస్తవుల కూడా జరుగుతోంది. అయితే సంఖ్యా పరంగా ఎక్కువ లేని వీరి ఓట్లు ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయని వేచిచూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close