తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిస్తేజమయిందా !?

వరుసగా రెండు రోజులు హైదరాబాద్ అట్టుడికిపోయింది. మొదటి రోజు రాజ్ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ హంగామా చేస్తే కనీసం అడ్డుకోలేకపోయారు. పోలీస్ ఇంటలిజెన్స్ ఏం చేసిందో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా ముట్టడి ఎలా చేయాలో అలా చేశారు. ప్రభుత్వంపై తమ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో ఉంటుందని పోలీసుల చొక్కాలు పట్టుకుని మరీ చూపించారు. ఈ ఘటనలు జరిగి ఇరవై నాలుగు గంటలు కాక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మంటల్లో చిక్కుకుంది. ఒక్క సారిగా వేల మంది ఆర్మీ లో ఉద్యోగాలు పొందాలనుకునే ఆశావహులు దూసుకొచ్చారు. వారంతా అప్పటికప్పుడు వచ్చిన వాళ్లు కాదు. మాట్లాడుకుని మరీ వచ్చారు.

వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుని స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. ఇంత భారీగా స్టేషన్‌పై వచ్చి పడినా తెలంగాణ అధికార యంత్రాంగంలోకదలిక లేదు. ఇంటలిజెన్స్ ఏమైందో స్పష్టత లేదు. చివరికి విధ్వంసం ప్రారంభమైన చాలా సేపటికి పోలీసు బలగాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు మాత్రమే లేదు.. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వారంతా ఇంటర్ విద్యార్థులు . వారిపై కూడా రాజకీయ ముద్ర వేసి.. పట్టించుకోవడం మానేశారు. మంచినీరు.. ఆహారం కూడా ఆపేసి విమర్శల పాలయ్యారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించి లైట్ తీసుకున్నారు.

ఈ వ్యవహారాలన్నింటిలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అటు సీఎం కానీ.. ఇటు కేటీఆర్ కానీ ఈ అంశాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కేటీఆర్ తమ రాష్ట్రంలో ఉన్నరైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగిందని కంగారు పడకుండా ఇదంతా యువతలో పెరుగుతున్న అసహనానికి సందేశం అని.. బీజేపీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అచేతనంగా మారిందన్న విమర్శలు రావడానికి వరుసగా జరుగుతున్న ఘటనలు కారణం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close