జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయక తప్పదా..?

నందమూరి సుహాసిని…కూకట్ పల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని.. నామినేషన్ల గడువు ప్రారంభమయ్యే వరకూ.. తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు కూడా ఊహించలేకపోయారు. టీడీపీ హైకమాండ్ దగ్గరకు ఈ ప్రతిపాదన వచ్చిందని.. దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న విషయం బయటకు తెలిసినప్పుడు చాలా మంది నిజమని అనుకోలేదు. అదో గాసిప్ అనుకున్నారు. కానీ.. నిజం అని తేలిన తర్వాత …సుహాసినికి కుటుంబ మద్దతు ఉందా.. అన్న అంచనాలు ప్రారంభయ్యాయి. అవి.. ఇప్పటికీ..అంతే కొనసాగుతున్నాయి. అందరి మద్దతు ఉందని… ఇప్పటికైతే అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాట్లాడే ప్రయత్నం చేయకపోవచ్చు కూడా.. వ్యతిరేకం కాదు.. కానీ మద్దతిస్తారా అన్నదే… అసలు విషయమని.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా.. బ్రదర్స్ కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించే అసలు చర్చ జరుగుతోంది. అందరి మద్దతుతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సుహాసిని చెప్పారు.

ట్వీట్ మాత్రమేనా నేరుగా ప్రచారం చేయరా..?

సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి కుటుంబసభ్యులు అందరూ హాజరవుతారని అనుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళురల్పించేటప్పుడు, తర్వాత తండ్రి హరికృష్ణకు.. మహాప్రస్థానంలో నివాళులు అర్పించేటప్పుడు … అందరూ కనిపించలేదు. ముఖ్యంగా కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. సుహాసిని నామినేషన్ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షించారు. అయితే.. ఉదయమే .. జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ ద్వారా సోదరికి… విజయం కలగాలని ఆకాంక్షించారు. తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎప్పటికీ పవిత్రమైనదేనన్నారు. అయితే ఆ ట్వీట్ లో టీడీపీ అధినేత, నందమూరి కుటుంబం నుంచి వారసుల్ని రాజకీయంలోకి తీసుకొస్తున్న మామ చంద్రబాబు గురించిన ప్రస్తావన లేదు. దీంతో బ్రదర్స్ ప్రత్యక్ష ప్రచారంపై.. అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీనిపై… బాలకృష్ణ విభిన్నంగా స్పందించారు. షూటింగులు లేకపోతే.. అందరూ ప్రచారంలో పాల్గొంటారని.. ప్రకటించారు.

బాలకృష్ణ మాటలు.. నందమూరి మళ్లీ కొత్త అనుమానాలు ప్రారంభమయ్యేలా చేశాయి. అంటే.. కూకట్ పల్లిలో టీడీపీ తరపున.. అదీ సోదరి తరపున ప్రత్యక్షంగా వచ్చి ప్రచారం చేయడానికి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని.. అందుకే… షూటింగ్ షెడ్యూల్స్ ను కారణంగా చూపిస్తున్నారనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

ప్రచారానికి రాకపోతే కుటుంబం సపోర్ట్ లేదన్న ప్రచారం ఖాయమేనా..?

ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ ప్రచారానికి రాకుండా.. సోషల్ మీడియా ద్వారా వీడియోల ద్వారా.. మద్దతు ప్రకటిస్తే..మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులకు అదో పెద్ద అజెండా అయిపోతుంది. సుహాసిని పోటీ కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండానే…జరుగుతోందని… దానికి సాక్ష్యం వారు ప్రచారం చేయకపోవడమేనని.. ఇతర పార్టీల నేతలు హోరెత్తిస్తారు. సోదరి కోసమే ప్రచారం చేయలేదు.. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు ప్రచారం చేస్తారన్న ప్రశ్నలు లేవనెత్తుతారు. వారి మద్దతు .. తెలుగుదేశం పార్టీకి… ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు లేదని.. నమ్మించడానికి.. టీడీపీ వ్యతిరేక పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాయి. దీన్ని తిప్పికొట్టడం… తెలుగుదేశం పార్టీకే కాదు.. నందమూరి కుటుంబానికి కూడా ఇబ్బందికరమే అవుతుంది. నందమూరి కుటుంబం టీడీపీని కాదని.. ఇతర పార్టీలకు మద్దతు ఇస్తుందని ఎవరూ అనుకోరు కానీ.. .. వారి మద్దతు సంపూర్ణంగా… టీడీపీ అధినేతకు లేదన్న ప్రచారం మాత్రం జరిగిపోతుంది. అంతిమంగా ఇది.. నందమూరి కుటుంబం అంతా.. ఏకతాటిపై లేదన్న ప్రచారం జరగడం కారణమవుతుందన్న అభిప్రాయం ఉంది.

కుటుంబం అంతా ఒకే మాటపై ఉందని నిరూపించలేరా..?

కానీ ఈ విషయాన్ని నందరమూరి బ్రదర్స్ చెప్పలేదు. నామినేషన్ సందర్భంగా సోదరికి శుభాకాంక్షలు.. చెప్పి విజయం సాధించాలని… కోరుకున్నారు. ప్రచారం గురించి ప్రస్తావించలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్… మహాకూటమి తరపున ప్రచారం చేయరు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. కూకట్ పల్లి బరిలో సోదరి ఉంది. అక్కడ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున.. సోదరి పోటీ చేస్తున్నారు. మరి ఆమెకు మద్దతుగా ప్రత్యక్ష ప్రచారం చేసే అవకాశం ఉందన్న నమ్మకం.. నందమూరి అభిమానులకు ఎక్కువగా ఉంది. సాధారణంగా.. ఇలాంటి సందర్భాల్లో.. చివరి రెండు రోజులో.. ఒక్క రోజే ప్రచారం చేసి.. ఫినిషింగ్ టచ్ ఇస్తూంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.. అందరూ.. ఏకతాటిపై ఉన్నారని.. అనివార్యంగా నిరూపించుకోవాల్సిన సందర్భం.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కారణంగా వచ్చింది. కూకట్ పల్లిలో సుహాసినికి లభించే మద్దతే ఆ నిరూపణ. మరి జూనియర్ ఏం చేస్తారో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్‌కి స‌ర్ది చెబుతున్న క్రిష్‌?

వ‌కీల్ సాబ్ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్టాలెక్కించాల్సిన సినిమా క్రిష్ దే. కానీ ప‌వ‌న్ ఆలోచ‌న మారింది. క్రిష్ సినిమా కాస్త వెన‌క్కి జ‌రిపి, ఆ స్థానంలో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఓకే...

ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో…

ఒక‌ప్పుడు కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా క‌నిపించిన పేరు.. ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు అన్నీ హిట్లే. హీరోగా మారాక ఆయ‌న కెరీర్ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోయింది. ద‌ర్శ‌కుడిగానూ బ్యాక్ స్టెప్ వేయాల్సివ‌చ్చింది....

రామ్ చ‌ర‌ణ్ కోసం ప్లాన్ బి

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇది వ‌ర‌కే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌పై యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ షెడ్యూల్‌కి...

తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.....

HOT NEWS

[X] Close
[X] Close