ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ వెళ్లారు. అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని వారిని కోరేందుకు చంద్రబాబు వెళ్లారు. అక్కడి ప్రధానితో పాటు అన్ని స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతారు. చంద్రబాబు లక్ష్యం అమరావతి లో గతంలో సింగపూర్ చేసుకున్న అభివృద్ధి ఒప్పందాన్ని మళ్లీ అమల్లోకి తీసుకు రావడం. జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. సింగపూర్ అధికారుల్ని కూడా వేధించారు. అందుకే వారు మరోసారి ఏపీ వైపు చూస్తారా లేదా అన్న సందేహాలు ఉన్నాయి.
సింగపూర్ లో అవినీతికి కఠిన శిక్షలు
సింగపూర్ .. దేశంలో అత్యంత తక్కువ అవినీతి అంటే దాదాపుగా అవినీతి లేని దేశాల్లో ఒకటి. ఈశ్వరన్ అనే అక్కడి మంత్రి.. కేవలం ఫుట్ బాల్ మ్యాచ్ టిక్కెట్లతో పాటు పర్యటన ఖర్చులు తీసుకున్నారన్న కారణంగా ఆయనపై అవినీతి ఆరోపణల కింద శిక్షలు విధించారు. రాజకీయాల్లో లేకుండా చేశారు. అలాంటి సీరియస్ శిక్షలు వేసే సింగపూర్ కు చెందిన ఎవరూ అవినీతి చేయాలని అనుకోరు. అసలు అలాంటి ప్రతిపాదనలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల దగ్గర పెట్టే ప్రయత్నం కూడా సాహసమే.
సింగపూర్ పై అవినీతి ముద్ర వేయాలని చూసిన జగన్
అవినీతి విషయంలో కఠినంగా ఉండే సింగపూర్ పై.. అమరావతి ఒప్పందంలో అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఎలా ఆడుకున్నారో అలా సింగపూర్ ప్రభుత్వాన్నీ బెదిరించే ప్రయత్నం చేశారు. అత్యంత ఘోరమైన దోపిడీదారుడిగా పేరు పొందిన ఆయన.. నిజాయితీకి మారు పేరు అయిన సింగపూర్ పై బండలేయడానికి ప్రయత్నించాడు. చివరికి చిరాకేసి సింగపూర్ వెళ్లిపోయింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సింగపూర్ రావాలని కోరుకుంటున్నారు. అందుకే వెళ్లారు.
అమరావతి అభివృద్ధికి కీలకం
సింగపూర్ ఒప్పందాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవర్గాల నుంచి విస్మయం వ్యక్తం అయింది. పట్టణీకరణలో ప్రపంచానికి మోడల్ గా ఉంటుందనుకున్న ప్రాజెక్టును ఇలా రాజకీయ కారణాలతో కుట్ర పూరితంగా చిదిమేస్తారా అని వారు ఆశ్చర్యపోయారు. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాలు చేసే చోటకు మళ్లీ సింగపూర్ వస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టం. కానీ సింగపూర్ అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి వస్తే మాత్రం .. అది ఏపీ రాజధానికి ఓ పెద్ద బూస్టప్ అనుకోవచ్చు.