ఉగ్రదాడికి దెబ్బతిన్న భారత్ కు ప్రపంచదేశాలు నుంచి సపోర్టు లభించింది. టెర్రరిజంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని భరోసా ఇస్తున్నాయి. అమెరికా నుంచి ఇజ్రాయెల్ వరకూ అందరూ సపోర్టు చేశారు. భారత్ కూడా ఉగ్రవాదుల్ని, వారిని సపోర్టు చేస్తున్న వారి సంగతి చూసేందుకు సిద్ధమయింది.
పాకిస్తాన్ పై దౌత్యపరమైన చర్యలు
కశ్మీర్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయంపై పూర్తి ఆధారాలున్నాయని కేంద్రం ప్రకటించింది. అందుకే పాకిస్తాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకున్నారు. సింధూ జలాల ఒప్పందం దగ్గర నుంచి.. పాకిస్తాన్ జాతీయుల్ని భారత్ నుంచి తరిమేయడం వరకూ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకెవరికీ ఇండియాలో వీసాలు కూడా ఇవ్వరు. అయితే ఇవన్నీ పాకిస్తాన్ కు పట్టవు. ఎందుకంటే వాళ్ల బుద్ది తమ కడుపు కాలిపోయినా… భారతీయుల ప్రాణాలు తీశాం కదా అని సంతోషపడే రకం.
ఎవరూ ఊహించని మిలటరీ చర్యలు
ఉగ్రవాదులపై మిలటరీ చర్యకు ఇండియా రెడీ అయింది. పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నా సరే వారి సంగతి తేల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా మిలటరీ ఆపరేషన్ల గురించి బయటకు చెప్పరు. అయిపోయిన తర్వాతే చెబుతారు. సర్జికల్ స్ట్రైక్స్ కూడా అలాగే ప్రకటించారు. ఈ సారి మరింత ఎక్కువగా ఈ దాడులు ఉండనున్నాయి. భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ నిర్వహిస్తున్న ఉగ్రవాద ఆర్మీ క్యాంపుల్ని నాశనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ ఏం చేయబోతోందన్నది చేసిన తర్వాతే వెలుగులోకి రానుంది.
దేశం అంతా ఏకం కావాల్సిన సమయం
పాకిస్తాన్ ఉగ్రదాడి విషయంలో దేశంలో కొంత మంది భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇందులో మతం కోణం లేదని.. బీజేపీ రాజకీయం చేస్తోందని అంటున్నారు. మతం కోణం ఉందని బాధితులే చెబుతున్నారు. ముస్లింలను వదిలి పెట్టారు. ఇది స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అడ్డగోలు రాజకీయాలు చేసి పాకిస్తాన్ కు సపోర్టు చేసినట్లుగా వ్యవహరిస్తే అది దేశద్రోహం అవుతుంది. ప్రపంచం అంతా భారత్ కు మద్దతిస్తోంది. కానీ.. దేశంలో భిన్న స్వరాలు వినిపించడం మంచిది కాదు.