మహేష్ బాబుని హిమాలయాలతో పోల్చారు రచయిత విజేయంద్ర ప్రసాద్. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరుగుతున్న #GlobeTrotter ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.
”కొన్నిసార్లు మనకి ఏం మాట్లాడాలో తెలియక మాటలురావు. ఇంకొన్నిసార్లు నిజంగానే మాట పడిపోతుంది. తిరుపతి వెంకన్న స్వామిని, హిమాలయ పర్వతాలను చూస్తున్నప్పుడు అలా మౌనంగా ఉండిపోతాం. అదొక డివైన్ ఫీలింగ్. ఈ సినిమాలో ఒక 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది. అందులో మహేష్ బాబు గారి నట విశ్వరూపం చూస్తుంటే నాకు అలాగే మాట పడిపోయింది. అప్పటికి డబ్బింగ్ లేదు, సీజీ లేదు, రీ రికార్డింగ్ లేదు. అయినా సరే కట్టిపడేసింది. మీరు కూడా ఆ అనుభూతి పొందుతారు’
”కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు ఇంకొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు. ప్రతి గుండె చప్పుడికి ఏం చేయాలో చెబుతున్నారు. మేము ఉడత సాయం చేశాం’అని ఎమోషనల్ గా మాట్లాడారు విజేయంద్ర ప్రసాద్.
