లలిత్ మోడీ వ్యవహారానికి మానవీయ కోణమా…భలే ఉంది!

లలిత్ మోడీకి పోర్చుగల్ వెళ్లేందుకు ఆయనకి వీసా ఇమ్మని తను బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదని బ్రిటన్ చట్టాలు అనుమతిస్తేనే వీసా ఇమ్మని కోరినట్లు సుష్మా స్వరాజ్ చెప్పారు. ఆయన భార్య భయంకరమయిన క్యాన్సర్ వ్యాధి సోకి పోర్చుగల్లో ఒక ఆసుపత్రిలో ఉందని తెలుసుకొని తను మానవతా దృక్పదంతోనే తను బ్రిటన్ ప్రభుత్వానికి ఆవిధంగా సూచించాను తప్ప లలిత్ మోడీకి ఆర్ధిక లబ్ది చేకూర్చలేదని ఆమె వాదించారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉన్న అదే విధంగా వ్యవహరించేవారేమోనని అన్నారు. లలిత్ మోడీ నేరస్తుడు కావచ్చును కానీ అతని భార్య ఎటువంటి నేరమూ చేయలేదని ఆమె కూడా ఒక సాధారణ భారతీయ పౌరురాలేననే ఉద్దేశ్యంతోనే ఆమె పరిస్థితి చూసి తను మానవత దృక్పదంతో స్పందించానని ఆమె తెలిపారు. మానవతా దృక్పధంతో చేసిన ఈ పని తప్పయితే ఎటువంటి శిక్ష విధించినా అనుభవించడానికి తను సిద్దంగా ఉన్నానని ఆమె అన్నారు.

సుష్మా స్వరాజ్ తను చేసిన పొరపాటును చాలా అందమయిన మాటలతో తెలివిగా కప్పిపెట్టుకొనే ప్రయత్నం చేసారని చెప్పవచ్చును. విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమె లలిత్ మోడీకి వీసా ఇమ్మని సూచిస్తే బ్రిటన్ ప్రభుత్వం ఆమె అభ్యర్ధనను తిరస్కరించదని ఆమెకే కాదు సాధారణ ప్రజలకి సైతం తెలుసు. కనుక ఒక నేరస్థుడికి ఆమె ఏ దృక్పదంతో సహాయపడినా కూడా అది తప్పే అవుతుంది. అందుకోసం ఆమె తన పదవిని కూడా దుర్వినియోగం చేశారు. అది కూడా మరొక నేరం. పైగా తన స్థానంలో సోనియాగాంధీ ఉన్నా బహుశః అలాగే వ్యవహరించేవారేమోనని ఆమె వితండవాదం చేసారు.

ఒకవేళ లలిత్ మోడీకి తన భార్యవద్దకు వెళ్ళాలనే ఆలోచన ఉంటే అతనే తన ప్రయత్నాలేవో తను చేసుకొని ఉండాల్సింది. కానీ సుష్మా స్వరాజ్ తో తనకున్న దృడమయిన పరిచయాలను ఉపయోగించుకొంటూ ఆమె చేత బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయించుకొన్నారు. అందుకు ఆమె నిరాకరించి ఉండి ఉంటే నేడు ఈదుస్థితి ఎదురయ్యేదే కాదు. కానీ ఆమె కూడా అతనితో ఉన్న పరిచయాలను దృష్టిలో ఉంచుకొని తన పదవిని, హోదాని దుర్వినియోగం చేస్తూ బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసారు. లలిత్ మోడీకి వీసా ఇమ్మని తను బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరినట్లుగా చెపుతూనే మళ్ళీ దానికి మానవతా దృక్పధం అనే అందమయిన రంగు పులిమారు. కానీ ఆవిధంగా చేసి ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం అవుతోంది.

తన పరిధిని అతిక్రమించిన ఆమెపై చర్యలు తీసుకోవలసిన మోడీ ప్రభుత్వం ఆమెను వెనకేసుకు వస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక మంచి రాజకీయ ఆయుధంగా మలచుకొని మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. అలాగని కాంగ్రెస్ పార్టీ ఏమీ మడికట్టుకొని కూర్చోలేదని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో ఎన్ని కుంభకణాలకు పాల్పడిందో ఎన్ని అక్రమాలకూ పాల్పడిందో, ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక ఎంతమంది మంత్రులకు ఉద్వాసన పలకవలసి వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. అన్ని రాజకీయ పార్టీలు ఒక తానులో ముక్కలే. ఎవరూ ఎవరికంటే తక్కువా కాదు…ఎక్కువా కాదు. ఎవరు అధికారంలో ఉంటే వారు దానిని విచ్చలవిడిగా ఇలాగ వాడేసుకొంటారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నపార్టీలు ఇలాగ అల్లరి చేస్తుంటాయి అంతే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ హీరోయిన్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్‌!

కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి హిట్ 'ఉప్పెన'తో కొట్టింది కృతిశెట్టి. తెలుగులో ఇది తనకు తొలి సినిమా. అంతకుముందు హిందీ సినిమా సూపర్ 30లో ఓ చిన్న...

అపార్టుమెంట్ కొనుక్కుంటే విలువ పెరగదా ?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కొరిక. సొంత ఇల్లు అంటే... చుట్టూ ఖాళీ స్థలం, కొన్ని చోట్లు .. ఉండేలా పొందికైనా ఇల్లు అని గతంలో ఊహించుకునేవారు. ఇప్పుడు...

పీవోకేని కలుపుకునేందుకు కేంద్రం కొత్త వ్యూహం ?

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్‌లో కలుపుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం కశ్మీర్ ఎన్నికలు జరుగుతూండటమే కాదు.. పీవోకేలో నెలకొన్న పరిస్థితులు...

మీమర్స్ కి మాంచి స్టఫ్ ఇచ్చిన ప్రభాస్

చిన్న సినిమాల టీజర్, ట్రైలర్స్ పెద్ద హీరోలు లాంచ్ చేసి ఎంతో కొంత ప్రమోషన్స్ లో భాగం కావడం కామన్. 'ట్రైలర్ బావుంది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయండి' అని తమవంతు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close