హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను దెబ్బతీయడానికి ఫేక్ న్యూస్ ను అస్త్రంగా చేసుకుంటోంది వైసీపీ. ఏదైనా ఓ వీడియో దొరికితే దానికి ట్విస్టులు పెట్టి తోచింది రాసేస్తున్నారు. ఓ బంగారు దుకాణంలో తన చెవి దిద్దుల్ని ఓ మహిళ తాకట్టు పెట్టింది. అక్కడ వైసీపీ లీడర్ ఎవరో ఆమెను మాటల్లో పెట్టి మాట్లాడించారు. రహస్యంగా వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె మాట్లాడిన దానికి అన్ని ట్విస్టులు పెట్టారు. చివరికి కొత్త పెన్షన్ ఇవ్వాలంటే పదివేలు లంచం అడిగారని ప్రచారం చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియా వైసీపీ సైన్యం అంతా వైరల్ చేసింది. అందరూ పోస్టు చేశారు. దీంతో ఆమె దగ్గరకు చాలా మంది వెళ్లారు. తన కోడలికి బాగో లేదని .. ఆస్పత్రిలో చూపించుకోవడానికి తన ఆభరణాలు తాకట్టు పెట్టానని .. ఆ షాపులో మాట్లాడిన వాళ్లు మాట్లాడితే మాట్లాడాను కానీ వీడియో తీశారని తనకు తెలియదని లబోదిబోమంది. నిజానికి ఇంకా కొత్త పెన్షన్ల గురించి ప్రక్రియ ప్రారంభం కాలేదు. లంచాలు ఇచ్చే , అడిగే అవకాశం లేదు. అయినా ప్రచారం చేశారు.
ఇలాంటి వాళ్లను క్షమిస్తే రోజూ ఇదే పని చేస్తారని హిందూపురం పోలీసులు కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ కూడా అసలేం జరిగిందో చెప్పి.. తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కేసులు పెడతామని ప్రకటించింది. ఈ క్రమంలో పలువురిపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారు. నిజంగా ఎవరైనా లంచం అడిగినట్లుగా ఉంటే వారికి ఆ రోజే ఉద్యోగంలో చివరి రోజు అవుతుంది.