ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ కొడుకు అరెస్ట్ !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ దూకుడు చూపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను ఢిల్లీ తరలించి అక్కడి కోర్టులో హాజరు పర్చనున్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు చంద్రారెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. తర్వాత అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.

మాగుంట కుటుంబం దశాబ్దాలుగా డిస్టిలరీల వ్యాపారంలో ఉన్నారు. అయితే వారిపై ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ కావాల్సి వచ్చింది. సౌత్‌ గ్రూపులో కేసీఆర్‌ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి లంచాలిచ్చి లిక్కర్ బిజినెస్ సొంతం చేసుకున్నారని ఈడీ చెబుతోంది.

సమీర్‌ మహేంద్రు: అరుణ్‌పిళ్లైకి, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ్‌ మాగుంటకు చెందిన జైనాబ్‌ ట్రైడింగ్‌, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు చెల్లించారు. మాగుంట ఆగ్రోఫామ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట రాఘవ్‌కు కూడా రెండు రిటైల్‌ జోన్లు ఉన్నాయిని ఈడీ చార్జిషీట్‌లో ప్రకటించింది.

మాగుంట రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి ఎంపీగా చూడాలనుకున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆయన మాత్రం…. రాజకీయ జీవితం ఆరంభం కాకుండానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అరెస్టయ్యారు. ఈ కేసులో వరుసగా అరెస్టులు చేస్తూండటంతో.. తదుపరి ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న టెన్షన్ … ఇతర నిందితుల్లో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close